Share News

కాఫీ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు 4న శంకుస్థాపన

ABN , Publish Date - Aug 26 , 2026 | 12:32 AM

మండలంలోని శెట్టిపాలెంలో ఏర్పాటు చేయనున్న కాఫీ ప్రొసెసింగ్‌ యూనిట్‌కు సెప్టెంబరు 4వ తేదీన శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు శంకుస్థాపన చేయనున్నట్టు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) జీఎం దేవరాజ్‌ తెలిపారు.

కాఫీ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు 4న శంకుస్థాపన
శెట్టిపాలెంలో కాఫీ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు కేటాయించిన స్థలాన్ని పరిశీలిస్తున్న జీసీసీ జీఎం దేవరాజ్‌, తదితరులు

ఉత్పత్తి ప్రారంభమైతే 500 మంది మహిళలకు ఉపాధి

8 జీసీసీ జీఎం దేవరాజ్‌ వెల్లడి

మాకవరపాలెం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని శెట్టిపాలెంలో ఏర్పాటు చేయనున్న కాఫీ ప్రొసెసింగ్‌ యూనిట్‌కు సెప్టెంబరు 4వ తేదీన శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు శంకుస్థాపన చేయనున్నట్టు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) జీఎం దేవరాజ్‌ తెలిపారు. శెట్టిపాలెంలో కాఫీ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు ప్రభుత్వం కేటాయించిన భూమిని ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శెట్టిపాలెంలో రూ.10 కోట్ల వ్యయంతో కాఫీ ప్రొసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం 2025 మే నెలలో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి 12 ఎకరాలను కేటాయించిందని చెప్పారు. కాఫీ ప్రొసెసింగ్‌ యూనిట్‌ ద్వారా సుమారు 500 మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని ఆయన చెప్పారు. జీఎం వెంట జీసీసీ అధికారి విశ్వనాఽథం, శెట్టిపాలెం మాజీ సర్పంచ్‌ అల్లు రామునాయుడు పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2026 | 12:32 AM