ఉక్కు బాధితులకు మాజీ సీఎం జగన్ పరామర్శ
ABN , Publish Date - Jun 11 , 2026 | 01:15 AM
స్టీల్‌ప్లాంటులో రెండు రోజుల క్రితం సంభవించిన ప్రమాదంలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి వచ్చారు. క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం అక్కడే ఉన్న వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు. అక్కడి నుంచి ఆస్పత్రి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి షీలానగర్‌లోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. అనంతరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు విమానంలో విజయవాడ వెళ్లిపోయారు.
విశాఖపట్నం, జూన్ 10 (ఆంధ్రజ్యోతి):