Share News

21 అభివృద్ధి పనులకు అటవీ అనుమతులు

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:08 PM

జిల్లాలో 21 అభివృద్ధి పనులకు సంబంధించిన అటవీ అనుమతుల మంజూరు ప్రతిపాదనలకు జిల్లా అధికారులు ఆమోదం తెలిపారు.

21 అభివృద్ధి పనులకు అటవీ అనుమతులు
వివిధ శాఖల అధికారులతో సమావేశమైన జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి

16 రోడ్లు, ఐదు సెల్‌టవర్లు, అంగన్‌వాడీ భవనాలకు ప్రతిపాదనలు

జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమోదించిన అధికారులు

పాడేరు, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో 21 అభివృద్ధి పనులకు సంబంధించిన అటవీ అనుమతుల మంజూరు ప్రతిపాదనలకు జిల్లా అధికారులు ఆమోదం తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కమిటీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో రోడ్లు, సెల్‌ టవర్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, తదితర 21 అభివృద్ధి పనులు చేపట్టేందుకు అటవీ అనుమతులపై చర్చించారు. ఈ ప్రతిపాదనల్లో 16 రోడ్లు, ఐదు సెల్‌ టవర్లు, అంగన్‌వాడీ భవనాలకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, సబ్‌కలెక్టర్‌ కె.సాహిత్‌, పంచాయతీరాజ్‌(పాజెక్ట్సు) ఈఈ రామకృష్ణారావు, పంచాయతీరాజ్‌ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ విద్యాసాగర్‌, కలెక్టరేట్‌ డీటీ పోలరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 11:08 PM