ఒనకఢిల్లీ సంతలో విదేశీ పర్యాటకుల సందడి
ABN , Publish Date - Mar 05 , 2026 | 10:41 PM
ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గల ఒనకఢిల్లీ వారపు సంతలో గురువారం విదేశీ పర్యాటకులు సందడి చేశారు.
ముంచంగిపుట్టు, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గల ఒనకఢిల్లీ వారపు సంతలో గురువారం విదేశీ పర్యాటకులు సందడి చేశారు. ఇటలీ దేశానికి చెందిన పర్యాటకులు సంతకు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. సంతలో అటూ ఇటూ తిరిగారు. అలాగే బొండా జాతీయులను విదేశీ పర్యాటకులు తమ కెమెరాలో బంధించారు. సంతలో వారు తీసుకువచ్చిన పలు రకాల వస్తువులను ఆసక్తిగా తిలకించి, వాటిని కొనుగోలు చేశారు. విదేశీయులతో ఫొటోలు దిగేందుకు స్థానికులు ఉత్సాహం చూపించారు. అలాగే విదేశీ పర్యాటకులు మాచ్‌ఖండ్ ప్రాజెక్టు పరిధిలో గల డుడుమ జలపాతం, వ్యూ పాయింట్‌ను సందర్శించారు. ప్రకృతి అందాలకు వారు ఫిదా అయ్యారు. మరో మూడు రోజుల పాటు ఈ ప్రాంతంలో ఉండి ప్రకృతి అందాలను తిలకిస్తామని వారు తెలిపారు.