ఉల్లి కోసం...
ABN , Publish Date - Sep 12 , 2026 | 01:09 AM
ఉల్లిపాయల కోసం వినియోగదారులు రైతుబజార్లలో బారులుతీరుతున్నారు.
మార్కెట్‌లో కిలో రూ.70
రైతుబజార్‌లలో రూ.55కు విక్రయం
గాజువాక, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి):
ఉల్లిపాయల కోసం వినియోగదారులు రైతుబజార్లలో బారులుతీరుతున్నారు. కొద్దిరోజుల క్రితం వరకూ కిలో రూ.15 నుంచి 20 పలికిన ఉల్లి ధర ఒక్కసారిగా రూ.70కి చేరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాయితీపై రైతుబజార్లలో కిలో రూ.55కు విక్రయించాలని నిర్ణయించింది. దీంతో రైతుబజార్లలో ఉల్లి కౌంటర్లు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో క్యూలో వచ్చేవిధంగా రైతుబజార్ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. గాజువాక మహిళా రైతుబజార్‌లో కేవలం ఒకేఒక కౌంటర్‌ను ఏర్పాటుచేశారు. మరో కౌంటర్ ఏర్పాటుచేయాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు చేపట్టనున్నట్టు రైతు బజార్ అధికారులు హామీ ఇచ్చారు.