Share News

అప్పన్న నిర్మల్య చందనం కోసం...

ABN , Publish Date - May 06 , 2026 | 01:11 AM

వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఏడాది పొడవునా పైపూతగా ఉండే చందనానికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది.

అప్పన్న నిర్మల్య చందనం కోసం...

ఇప్పటివరకూ 5,400 ప్యాకెట్ల విక్రయం

మూడో విడతగా 11, 12 తేదీల్లో వెయ్యేసి ప్యాకెట్లు విక్రయించనున్నట్టు ఈవో వెల్లడి

సింహాచలం, మే 5 (ఆంధ్రజ్యోతి):

వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఏడాది పొడవునా పైపూతగా ఉండే చందనానికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఏప్రిల్‌ 20న చందనోత్సవాన్ని పురస్కరించుకుని అంతవరకు స్వామి పైనున్న చందనాన్ని అర్చకులు తొలగించారు. ఉత్సవం ముగిసిన తరువాత ఏప్రిల్‌ 27 నుంచి మూడు రోజులపాటు, అదేవిధంగా రెండో విడతగా ఈనెల 3, 4 తేదీల్లో మొత్తం మీద 5,400 ప్యాకెట్ల చందనాన్ని భక్తులకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు జరిపారు. మంగళవారం కూడా విక్రయాలు జరిగాయి. భక్తుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మూడో విడతగా ఈనెల 11, 12 తేదీల్లో రోజుకు వెయ్యి చొప్పున నిర్మాల్య చందనం విక్రయించాలని నిర్ణయించినట్టు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి జల్లేపల్లి వెంకటరావు మంగళవారం ప్రకటించారు. ఆయా రోజుల్లో ఉదయం ఎనిమిది గంటలకు విక్రయాలు ప్రారంభమవుతాయని, భక్తులు ఆధార్‌ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని కోరారు. ఒక్కొక్కరికి ఒక్క ప్యాకెట్‌ మాత్రమే తెలిపారు.

Updated Date - May 06 , 2026 | 01:11 AM