ఉదయం పొగమంచు.. మధ్యాహ్నం ఎండ తీవ్రత
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:48 PM
మన్యంలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 10 గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్మేసింది. మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉంది.
అరకులోయలో 33.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
పాడేరు, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): మన్యంలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 10 గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్మేసింది. మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉంది. అరకులోయలో 33.8, కొయ్యూరులో 33.2, జి.మాడుగులలో 32.2, పెదబయలులో 30.4, చింతపల్లిలో 30.2, అనంతగిరిలో 29.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాగల ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు
చింతపల్లి: జిల్లాలో రాగల ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. రాగల ఐదు రోజుల వాతావరణ సమాచారాన్ని శాస్త్రవేత్తలు మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు అరకు, పాడేరు, చింతపల్లి పరిధిలో ఈ నెల 12వ తేదీ వరకు కనిష్ఠంగా 0.1 మిల్లీమీటర్లు నుంచి గరిష్ఠంగా 6.6 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదవుతుందన్నారు.