కోస్తా జిల్లాల్లో పొగమంచు
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:50 AM
ఉత్తరప్రదేశ్ నుంచి మధ్య భారతం మీదుగా కర్ణాటక వరకూ ఉపరితలద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో మధ్యభారతం నుంచి చలిగాలులు తెలంగాణ, దానికి ఆనుకుని కోస్తాలోని పలు జిల్లాలపైకి వీస్తున్నాయి.
విశాఖపట్నం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్ నుంచి మధ్య భారతం మీదుగా కర్ణాటక వరకూ ఉపరితలద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో మధ్యభారతం నుంచి చలిగాలులు తెలంగాణ, దానికి ఆనుకుని కోస్తాలోని పలు జిల్లాలపైకి వీస్తున్నాయి. దీంతో పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో బుధవారం ఉదయం అనేకచోట్ల పొగమంచు కురిసింది. పొగమంచు కురుస్తున్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని బుధవారం విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరిక జారీచేసింది. ఇంకా చలి పెరుగుతుందని పేర్కొంది. గురువారం ఉదయం పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చి మ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పొగమంచు కురుస్తుందని, కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో చలి పెరిగి రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని తెలిపింది.