Share News

ఏకగ్రీవాలపై గురి

ABN , Publish Date - Nov 15 , 2026 | 12:46 AM

జిల్లాలో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండడంతో వేళ గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జిల్లాలోని 642 గ్రామ పంచాయతీలు, 6,258 వార్డులకు మూడు దశల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఆదివారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానున్నది. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం భారీగా నగదు ప్రోత్సాహకాలను ప్రకటించడంతో వీలైనన్ని ఎన్నిక పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు పదవులను ఏకగ్రీవం చేసుకునేందుకు అధికార కూటమి పార్టీల నేతలు పావులు కదుపుతున్నారు.

ఏకగ్రీవాలపై గురి

సర్పంచ్‌, వార్డు పదవులకు పోటీ లేకుండా ఎన్నికైతే భారీగా నగదు ప్రోత్సాహకాలు

గ్రామపెద్దల సమక్షంలో రాజకీయ పార్టీలు చర్చలు

-----

ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు

5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు

ఐదు వేల నుంచి 10 వేల వరకు జనాభా ఉంటే రూ.25 లక్షలు

10 వేలకుపైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షలు

---

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండడంతో వేళ గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జిల్లాలోని 642 గ్రామ పంచాయతీలు, 6,258 వార్డులకు మూడు దశల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఆదివారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానున్నది. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం భారీగా నగదు ప్రోత్సాహకాలను ప్రకటించడంతో వీలైనన్ని ఎన్నిక పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు పదవులను ఏకగ్రీవం చేసుకునేందుకు అధికార కూటమి పార్టీల నేతలు పావులు కదుపుతున్నారు. సుహృద్భావ వాతావరణంలో అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో స్వేచ్ఛాయుతంగా ఏకగ్రీవ ఎన్నికల కోసం గ్రామాల్లో రాజకీయ పార్టీల నాయకులు, పెద్దలు కలిసి చర్చలు జరుపుతున్నారు. జనాభా ప్రాతిపదికన ఏకగ్రీవం అయిన పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించడంతో చిన్న పంచాయతీలతోపాటు పెద్ద పంచాయతీల్లో కూడా ఏకగ్రీవాల విషయంలో రాజకీయ నేతలు ఒక తాటిపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనప్పుడే ఈ ప్రోత్సాహకం లభిస్తుంది. అయితే ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు లేకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా స్వచ్ఛందంగా జరిగే ఏకగ్రీవాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రోత్సాహకంగా ఇచ్చే ఈ నిధులను సదరు పంచాయతీలో అభివృద్ధి పనులను వినియోగించాల్సి వుంటుంది. తొలి దశ ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో ఏకగ్రీవాలపై చర్చలు, సమావేశాలు మొదలైనట్టు తెలిసింది.

Updated Date - Nov 15 , 2026 | 12:46 AM