Share News

జనసేన బలోపేతంపై దృష్టి

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:35 AM

జనసేన పార్టీని బలోపేతం చేయడంపై అధిష్ఠానం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పార్టీ నేతలతో జనసేన సమాచార సేకరణ కమిటీ అరకులోయ పార్లమెంట్‌ పరిశీలకుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు సోమవారం మండలంలోని బెంజిపూర్‌ సమీపంలో గల ఓ రిసార్ట్స్‌ వద్ద సమావేశం నిర్వహించారు.

జనసేన బలోపేతంపై దృష్టి
జనసేన పార్టీ శ్రేణులతో ఎమ్మెల్సీ నాగబాబు

పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ నాగబాబు దిశానిర్దేశం

అరకులోయ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీని బలోపేతం చేయడంపై అధిష్ఠానం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పార్టీ నేతలతో జనసేన సమాచార సేకరణ కమిటీ అరకులోయ పార్లమెంట్‌ పరిశీలకుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు సోమవారం మండలంలోని బెంజిపూర్‌ సమీపంలో గల ఓ రిసార్ట్స్‌ వద్ద సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు పార్టీకి సేవలందించి, పార్టీ పటిష్టతకు ఎవరు ఏ విధంగా కృషి చేశారు?, భవిష్యత్తులో ఏ విధమైన సేవలు అందించడానికి ఆసక్తి చూపుతున్నారనే దానిపై వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. పంచాయతీ, మండల, అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో ఏ స్థాయిలో సేవలందించాలనుకుంటున్నారో వారి నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ఉదయం గంటన్నర సేపు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8.30 వరకు సమావేశం నిర్వహించారు. వారి నుంచి సేకరించిన దరఖాస్తులను పార్టీ అధినేత ముందుకు తీసుకువెళ్లనున్నట్టు నాగబాబు తెలిపారు. కాగా మంగళవారం పాడేరులో ఆ నియోజకవర్గ నేతలతో సమావేశం కానున్నారు. ఆయన వెంట జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్‌ వంపూరి గంగులయ్య, తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 12:35 AM