Share News

ఆదాయాన్నిచ్చే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి

ABN , Publish Date - Jul 29 , 2026 | 12:47 AM

గిరిజనులకు ఆదాయాన్నిచ్చే ప్రత్యామ్నాయ పంటలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. మండలంలోని మారుమూల సప్పిపుట్టు గ్రామంలో మంగళవారం పండ్ల మొక్కలు నాటే కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. గంజాయి సాగును విడిచిపెట్టి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకుంటూ గిరిజనులు జీవనం సాగించాలన్నారు. గిరిజన మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గిరిజన ప్రాంతాన్ని గంజాయి రహిత చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే గిరిజనులకు సీతాఫలం, అవకాడో మొక్కలు, రాజ్‌మా విత్తనాలను పంపిణీ చేస్తూ వారు సుస్థిర జీవనం సాగించేందుకు సహకరిస్తున్నామని చెప్పారు.

ఆదాయాన్నిచ్చే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి
గిరిజన రైతులకు మొక్కలు పంపిణీ చేస్తున్న మంత్రులు అనిత, సంధ్యారాణి

సద్వినియోగం చేసుకోవాలని గిరిజన రైతులకు మంత్రులు అనిత, సంధ్యారాణి సూచన

- సప్పిపుట్టు గ్రామంలో పండ్ల మొక్కల పంపిణీ

పాడేరు, జూలై 28 (ఆంధ్రజ్యోతి): గిరిజనులకు ఆదాయాన్నిచ్చే ప్రత్యామ్నాయ పంటలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. మండలంలోని మారుమూల సప్పిపుట్టు గ్రామంలో మంగళవారం పండ్ల మొక్కలు నాటే కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. గంజాయి సాగును విడిచిపెట్టి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకుంటూ గిరిజనులు జీవనం సాగించాలన్నారు. గిరిజన మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గిరిజన ప్రాంతాన్ని గంజాయి రహిత చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే గిరిజనులకు సీతాఫలం, అవకాడో మొక్కలు, రాజ్‌మా విత్తనాలను పంపిణీ చేస్తూ వారు సుస్థిర జీవనం సాగించేందుకు సహకరిస్తున్నామని చెప్పారు. అలాగే సప్పిపుట్టు వాసులతో మాట్లాడి గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలకు కృషి చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. జిల్లాని గంజాయి సాగు నుంచి విముక్తి చేసేందుకు పోలీసు శాఖ, ఈగల్‌ బృందం చేసిన కృషికి గిరిజనులు సంపూర్ణంగా సహకరించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో భాగంగా గిరిజనులకు పలు రకాల పండ్ల మొక్కలను, విత్తనాలను మంత్రులు పంపిణీ చేశారు. అనంతరం సప్పిపుట్టు గ్రామంలో పలు మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం ఈగల్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌: 1972ను ప్రదర్శించారు.

మంత్రులకు ఘనంగా స్వాగతం పలికిన గిరిజనులు

మండలంలోని మారుమూల సప్పిపుట్టు గ్రామానికి వచ్చిన రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణిలకు గిరిజనులు ఘన స్వాగతం పలికారు. గిరిజన మహిళలు ధింసా నృత్యాలతో మంత్రులు, అధికారులను ఆహ్వానించారు. వారితో అతిథులు ధింసా నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ, కలెక్టర్‌ టి.నిషాంతి, ఎస్‌పీ అమిత్‌బర్దార్‌, జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డ్వామా పీడీ విద్యాసాగరరావు, జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రాష్ట్ర జానపదకళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్‌ వంపూరు గంగులయ్య, జీసీసీ డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, టూరిజం డైరెక్టర్‌ కేవీ రమేశ్‌నాయుడు, పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి డప్పోడి వెంకటరమణ, ఐటీడీపీ ఇన్‌చార్జి బుద్ద జ్యోతికిరణ్‌, వివిధ శాఖల అధికారులు, కూటమి ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jul 29 , 2026 | 12:47 AM