Share News

ఎలమంచిలికి నిధుల వరద

ABN , Publish Date - Sep 22 , 2026 | 01:21 AM

ఎలమంచిలి మునిసిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం వీఎంఆర్‌డీఏ నిధులు రూ.24 కోట్లు మంజూరు చేసింది.

ఎలమంచిలికి నిధుల వరద

మునిసిపాలిటీలో అభివృద్ధి పనులకు రూ.24 కోట్ల వీఎంఆర్‌డీఏ నిధులు

నేడు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన

ఎలమంచిలి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):

ఎలమంచిలి మునిసిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం వీఎంఆర్‌డీఏ నిధులు రూ.24 కోట్లు మంజూరు చేసింది. ఆయా పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం కుప్పం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారని మునిసిపల్‌ కమిషనర్‌ ప్రసాదరాజు తెలిపారు. పట్టణంలో అభివృద్ధి పనులకు ఇంత మొత్తంలో నిధులు మంజూరు చేయడం ఇదే ప్రథమం అని మునిసిపల్‌ అధికారులు చెబుతున్నారు. మునిసిపల్‌ కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌, ఏపీఆర్‌డీసీ చైర్మన్‌ ప్రగడ నాగేశ్వరరావు, తదితరులు హాజరుకానున్నారు. వీఎంఆర్‌డీఏ కేటాయించిన ఈ నిధులతో అన్ని వార్డుల్లో రహదారులు, డ్రైనేజీ కాలువలు, ఇతర మౌలిక వసతుల పనులు చేపడతారు.

Updated Date - Sep 22 , 2026 | 01:21 AM