Share News

కేజీబీవీ ప్రిన్సిపాల్‌తో సహా ఐదుగురి సస్పెన్షన్‌

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:33 PM

విషపురుగు కాటు వలన కేజీబీవీ విద్యార్థిని మైలపల్లి నవ్య మృతి చెందడంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్‌ ఎస్‌.ఉమాదేవితో పాటు ఉపాధ్యాయులు డి.సునీత, ఎస్‌.రూప, వాచ్‌మన్‌ సీహెచ్‌ చిలకమ్మ, ఏఎన్‌ఎం జి.ఈశ్వరిని డీఈవో అప్పారావునాయుడు శనివారం రాత్రి సస్పెండ్‌ చేశారు.

కేజీబీవీ ప్రిన్సిపాల్‌తో సహా ఐదుగురి సస్పెన్షన్‌
బాలిక తల్లి ఎల్లయ్యమ్మకు చెక్కును అందజేస్తున్న దృశ్యం

విద్యార్థిని మృతి చెందడంతో చర్యలు

బాలిక కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల పరిహారం అందజేత

అచ్యుతాపురం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): విషపురుగు కాటు వలన కేజీబీవీ విద్యార్థిని మైలపల్లి నవ్య మృతి చెందడంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్‌ ఎస్‌.ఉమాదేవితో పాటు ఉపాధ్యాయులు డి.సునీత, ఎస్‌.రూప, వాచ్‌మన్‌ సీహెచ్‌ చిలకమ్మ, ఏఎన్‌ఎం జి.ఈశ్వరిని డీఈవో అప్పారావునాయుడు శనివారం రాత్రి సస్పెండ్‌ చేశారు. అచ్యుతాపురం కేజీబీవీలో ఏడవ తరగతి చదువుతున్న పూడిమడక శివారు కడపాలేనికి చెందిన మైలపల్లి నవ్య(13)ని శనివారం విషపురుగు కుట్టడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నవ్య చనిపోయిందని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు పాఠశాల వద్ద ఆందోళన చేయడంతో పరవాడ డీఎస్పీ మోహనరావు, అచ్యుతాపురం సీఐ చంద్రశేఖర్‌, ఆర్డీవో ఆయీషా శనివారం రాత్రి పాఠశాలలో విచారణ జరిపారు. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ చొరవతో ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. పరిహారం చెక్కును మృతురాలితల్లి మైలపల్లి ఎర్రయ్యమ్మకు అచ్యుతాపురం తహశీల్దార్‌ శ్రీను, సీఐ ఆర్‌వీవీఎస్‌ఎస్‌ చంద్రశేఖర్‌ ఆదివారం అందజేశారు.

Updated Date - Apr 12 , 2026 | 11:33 PM