Share News

అటవీ శాఖ శకటానికి ప్రథమ స్థానం

ABN , Publish Date - Jan 26 , 2026 | 11:19 PM

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై రూపొందించిన శకటాలు, స్టాళ్ల ప్రదర్శన ఆకట్టుకున్నాయి.

అటవీ శాఖ శకటానికి ప్రథమ స్థానం
ప్రథమ బహుమతి పొందిన అటవీ శాఖ శకటం

పాడేరు, జనవరి 26(ఆంధ్రజ్యోతి):

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై రూపొందించిన శకటాలు, స్టాళ్ల ప్రదర్శన ఆకట్టుకున్నాయి. అటవీ, వైద్య ఆరోగ్య, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి, స్వచ్ఛరథం, విద్యాశాఖ, జిల్లా గ్రామీణాభివృధ్ది సంస్థ, ఏపీ ఈపీడీసీఎల్‌, రవాణా, అగ్నిమాపక శాఖలు శకటాలను ప్రదర్శించాయి. వేడుకల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జీసీసీ, వెలుగు, హౌసింగ్‌, శిశు సంక్షేమం, వ్యవసాయ, ఉద్యానవన, కాఫీ, యూనియన్‌ బ్యాంక్‌, తదితర స్టాళ్లను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌, ఎస్‌పీ అమిత్‌బర్థార్‌, ఐటీడీఏ పీవో శ్రీపూజ తదితరులు సందర్శించారు. శకటాల ప్రదర్శనలో అటవీ శాఖకు ప్రథమ, వైద్య ఆరోగ్యశాఖకు ద్వితీయ, గ్రామీణ నీటిసరఫరా విభాగానికి తృతీయ స్థానాలు దక్కాయి. చక్కని ప్రదర్శనలిచ్చిన విద్యార్థులకు అతిథులు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేడ్కర్‌, రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఎంవీఎస్‌.లోకేశ్వరరావు, డీఎంహెచ్‌వో డి.కృష్ణమూర్తినాయక్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థఽ పీడీ వి.మురళి, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్‌ స్వామినాయుడు, గ్రామ సచివాలయాల జిల్లా నోడల్‌ అధికారి పీఎస్‌.కుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్‌, జిల్లా విద్యాశాఖాధికారి కె.రామకృష్ణారావు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నందు, జిల్లా ఉద్యానవనాధికారి కె.బాలకర్ణ, రైతు సాధికారత సంస్థ డీపీఎం ఎల్‌.భాస్కరరావు, టీడబ్లూ ఈఈ వేణుగోపాల్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్‌, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీబాయి, జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్‌ డాక్టర్‌ వంపూరు గంగులయ్య, జీసీసీ డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 26 , 2026 | 11:19 PM