ముగిసిన తొలి విడత నామినేషన్ల పర్వం
ABN , Publish Date - Nov 18 , 2026 | 01:09 AM
జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఈ మూడు మండలాలకు సంబంధించి 66 గ్రామ పంచాయతీలకు 447, అలాగే 686 వార్డులకు సంబంధించి 1,624 నామినేషన్లను అధికారులు స్వీకరించారు.
- చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో 66 పంచాయతీలు, 686 వార్డులు
- సర్పంచులకు 447, వార్డులకు 1,624 నామినేషన్లు దాఖలు
- నేడు పరిశీలన
పాడేరు, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఈ మూడు మండలాలకు సంబంధించి 66 గ్రామ పంచాయతీలకు 447, అలాగే 686 వార్డులకు సంబంధించి 1,624 నామినేషన్లను అధికారులు స్వీకరించారు. జిల్లాలో చింతపల్లి మండలంలో 17 పంచాయతీలు- 204 వార్డులు, 9 నామినేషన్ కేంద్రాలు, జీకేవీధిలో 16 పంచాయతీలు- 188 వార్డులు, 8 నామినేషన్ కేంద్రాలు, కొయ్యూరు మండలంలో 33 పంచాయతీలు - 294 వార్డులు, 13 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో చింతపల్లి మండలంలో 65,374 మంది, జీకేవీధిలో 52,412, కొయ్యూరులో 43,711 మొత్తం 1,61,497 మంది ఓటర్లున్నారు. బుధవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ చేపట్టనున్నారు.
చింతపల్లిలో...
చింతపల్లి: మండలంలోని 17 పంచాయతీల సర్పంచ్ పదవులకు మొత్తం 139, వార్డు సభ్యుల పదవులకు 477 నామినేషన్లు వచ్చాయని ఎంపీడీవో లాలం సీతయ్య తెలిపారు. మంగళవారం చివరి రోజు కావడంతో సర్పంచ్ పదవికి 44, వార్డు సభ్యులకు 302 నామినేషన్లు వచ్చాయి. మూడవ రోజు బెన్నవరం పంచాయతీ సర్పంచ్ పదవికి ఐదు, వార్డు సభ్యులు 18, అన్నవరం వార్డు సభ్యులకు 23, బలపం వార్డు సభ్యులకు 14, చింతపల్లి సర్పంచ్ మూడు, వార్డు సభ్యులు 31, చౌడుపల్లి సర్పంచ్ పదవికి ఐదు, వార్డు సభ్యులు 30, గొందిపాకలు సర్పంచ్ పదవికి నాలుగు, వార్డు సభ్యులు 11, కిటుముల సర్పంచ్ ఒకటి, వార్డు 14, కొమ్మంగి సర్పంచ్ రెండు, వార్డు సభ్యులు ఆరు, కొత్తపాలెం సర్పంచ్ పదవికి రెండు, వార్డు సభ్యులు 27, కుడుముసారి సర్పంచ్ పదవికి రెండు, వార్డు సభ్యులు 20, లంబసింగి సర్పంచ్ పదవికి ఆరు, వార్డు సభ్యులు 26, లోతుగెడ్డ సర్పంచ్ పదవికి మూడు, వార్డు సభ్యులు 14, పెదబరడ సర్పంచ్ పదవికి మూడు, వార్డు సభ్యులు 21, అంజలి శనివారం సర్పంచ్ పదవికి రెండు, వార్డు సభ్యులు 16, తాజంగి సర్పంచ్ పదవికి మూడు, వార్డు సభ్యులు 13, తమ్మంగుల సర్పంచ్ పదవికి ఒకటి, వార్డు సభ్యులు 13, యర్రబొమ్మలు సర్పంచ్ పదవికి రెండు, వార్డు సభ్యులకు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయన్నారు.
జీకే వీఽధిలో...
గూడెంకొత్తవీధి: మండలంలోని 16 పంచాయతీల పరిధిలో సర్పంచ్ పదవికి 111, వార్డు సభ్యులకు 437 నామినేషన్లు దాఖలయ్యాయని ఎంపీడీవో రమణబాబు తెలిపారు. మంగళవారం నామినేషన్లకు ఆఖరి రోజు కావడంతో సర్పంచ్, వార్డు సభ్యులకు అధిక సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. మూడవ రోజు సర్పంచ్‌కి 49, వార్డు సభ్యుల పదవికి 319 నామినేషన్లు దాఖలయ్యాయి. సీలేరు సర్పంచ్ పదవికి ఎనిమిది, వార్డు సభ్యులకు 39, దుప్పులవాడ సర్పంచ్ పదవికి నాలుగు, వార్డు సభ్యులకు 32, ధారకొండ సర్పంచ్ పదవికి ఎనిమిది, వార్డు సభ్యుల పదవికి 31, గుమ్మిరేవులు సర్పంచ్ పదవికి ఎనిమిది, వార్డు సభ్యులు 21, గాలికొండ సర్పంచ్ పదవికి రెండు, వార్డు సభ్యులకు 18, అమ్మవారి ధారకొండ సర్పంచ్ పదవికి మూడు, వార్డు సభ్యులకు 17, జీకేవీధి సర్పంచ్ పదవికి 14, వార్డు సభ్యులు పదవికి 46, దేవరాపల్లి సర్పంచ్ పదవికి ఎనిమిది, వార్డు సభ్యులు 20, లక్కవరపుపేట సర్పంచ్ పదవికి ఏడు, వార్డు సభ్యులకు 25, పెదవలస సర్పంచ్ పదవికి మూడు, వార్డు సభ్యులు 25, సంకాడ సర్పంచ్ పదవికి ఎనిమిది, వార్డు సభ్యులు 24, రింతాడ సర్పంచ్ పదవికి 12, వార్డు సభ్యులు పదవికి 40, వంచుల సర్పంచ్ పదవికి ఎనిమిది, వార్డు సభ్యులు 23, జర్రెల సర్పంచ్ పదవికి ఏడు, వార్డు సభ్యులకు 28, మొండిగెడ్డ సర్పంచ్ పదవికి నాలుగు, వార్డు సభ్యులకు 16, దామనాపల్లి సర్పంచ్ పదవికి ఏడు, వార్డు సభ్యులు పదవికి 32 నామినేషన్లు వచ్చాయి.
కొయ్యూరులో..
కొయ్యూరు: మండలంలోని 33 పంచాయతీలకు గాను సర్పంచ్ పదవికి 197, వార్డు సభ్యులకు 710 నామినేషన్లు దాఖలయ్యాయని ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు తెలిపారు. మంగళవారం నామినేషన్లకు ఆఖరి రోజు కావడంతో సర్పంచ్ పదవికి 99, వార్డు సభ్యులకు 225 నామినేషన్లు వచ్చాయన్నారు. కాగా ఆడాకులు సర్పంచ్ పదవికి 5, వార్డు సభ్యులకు 41, ఆర్.కొత్తూరు సర్పంచ్‌కు 5, వార్డు సభ్యులకు 25, బాలారం సర్పంచ్‌కు 10, వార్డు సభ్యులకు 17, బకులూరు సర్పంచ్‌కు 8, వార్డు సభ్యులకు 22, అంతాడ సర్పంచ్‌కు 4, వార్డు సభ్యులకు 21, బంగారమ్మపేట సర్పంచ్‌కు 4, వార్డు సభ్యులకు 13, బూదరాళ్ల సర్పంచ్‌కు 8, వార్డు సభ్యులకు 32, చీడిపాలెం సర్పంచ్‌కు 7, వార్డు సభ్యులకు 27, గదభపాలెం సర్పంచ్‌కు 5, వార్డు సభ్యులకు 19, చిట్టింపాడు సర్పంచ్‌కు 8, వార్డు సభ్యులకు 17, మూలపేట సర్పంచ్‌కు 8, వార్డు సభ్యులకు 20, డౌనూరు సర్పంచ్‌కు 6, వార్డు సభ్యులకు 25, కంఠారం సర్పంచ్‌కు 5, వార్డు సభ్యులకు 19, కొమ్మిక సర్పంచ్‌కు 6, వార్డు సభ్యులకు 25, రత్నంపేట సర్పంచ్‌కు 5, వార్డు సభ్యులకు 16, కినపర్తి సర్పంచ్‌కు 6, వార్డు సభ్యులకు 13, కొండగోకిరి సర్పంచ్‌కు 6, వార్డు సభ్యులకు 13, కొండగోకిరి సర్పంచ్‌కు 3, వార్డు సభ్యులకు 23, కొయ్యూరు సర్పంచ్‌కు 5, వార్డు సభ్యులకు 25, ఎం.భీమవరం సర్పంచ్‌కు 4, వార్డు సభ్యులకు 16, చింతలపూడి సర్పంచ్‌కు 4, వార్డు సభ్యులకు 27, మంప సర్పంచ్‌కు 3, వార్డు సభ్యులకు 17, మర్రివాడ సర్పంచ్‌కు 8, వార్డు సభ్యులకు 22, బట్టపణుకుల సర్పంచ్‌కు 4, వార్డు సభ్యులకు 10, పి.మాకవరం సర్పంచ్‌కు 4, వార్డు సభ్యులకు 20, నడింపాలెం సర్పంచ్‌కు 5, వార్డు సభ్యులకు 15, నల్లగొండ సర్పంచ్‌కు 6, వార్డు సభ్యులకు 20, రావణాపల్లి సర్పంచ్‌కు 8, వార్డు సభ్యులకు 14, రాజేంద్రపాలెం సర్పంచ్‌కు 11, వార్డు సభ్యులకు 29, రేవళ్ళు సర్పంచ్‌కు 6, వార్డు సభ్యులకు 28, శరభన్నపాలెం సర్పంచ్‌కు 8, వార్డు సభ్యులకు 28, వెలగలపాలెం సర్పంచ్‌కు 6, వార్డు సభ్యులకు 18, యు.చీడపాలెం సర్పంచ్‌కు 8, వార్డు సభ్యులకు 25 నామినేషన్లు దాఖలయినట్టు ఎంపీడీవో తెలిపారు.
-------------------------------
తొలి విడతకు మూడు మండలాల్లో దాఖలైన నామినేషన్లు
మండలం మొత్తం పంచాయతీలు వార్డులు సర్పంచ్‌లకు.. వార్డు సభ్యులకు..
----------------------------------------------------------------------------------------
చింతపల్లి 17 204 139 477
జీకేవీధి 16 188 111 437
కొయ్యూరు 33 294 197 710
--------------------------------------------------------------------------------------
మొత్తం 66 686 447 1,624
----------------------------------------------------------------------------------