Share News

నేడే తొలి విడత పల్లె పోరు

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:06 AM

జిల్లాలో చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి.

నేడే తొలి విడత పల్లె పోరు
చింతపల్లిలో పోలింగ్‌ కేంద్రాలకు బ్యాలెట్‌ బాక్స్‌, సామగ్రితో వెళుతున్న ఉద్యోగులు

చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో ఎన్నికలు

మొత్తం 65 పంచాయతీల్లో సర్పంచులకు 268 మంది, 553 వార్డులకు 1,330 మంది పోటీ

మూడు మండలాల్లో 686 పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి

ఎన్నికల సామగ్రితో పోలింగ్‌ కేంద్రాలకు తరలిన సిబ్బంది

(పాడేరు - ఆంధ్రజ్యోతి)

జిల్లాలో చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. మూడు మండలాల్లో 65 గ్రామ పంచాయతీలు, 553 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు బుధవారం ఆయా మండల కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ చేపట్టారు. ప్రత్యేక వాహనాల్లో ఆయా పోలింగ్‌ కేంద్రాలకు సామగ్రితో సిబ్బందిని తరలించారు.

చింతపల్లి మండలంలో మొత్తం 17 పంచాయతీలకు 96 మంది సర్పంచ్‌ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 204 వార్డులకు గాను 56 ఏకగ్రీవం కాగా, మిలిగిన 148 వార్డులకు 394 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. జీకేవీధి మండలంలో మొత్తం 16 పంచాయతీలకు 79 మంది సర్పంచులుగా పోటీ పడుతున్నారు. మొత్తం 188 వార్డులకు గాను 29 ఏకగ్రీవం కాగా, మిలిగిన 159 వార్డులకు 390 మంది బరిలో ఉన్నారు. కొయ్యూరు మండలంలో మొత్తం 33 పంచాయతీలకు బాలారం పంచాయతీ ఏకగ్రీవం కాగా, మిలిగిన 32 పంచాయతీకు 93 మంది, 294 వార్డులకు గాను 47 ఏకగ్రీవం కాగా, మిలిగిన 246 వార్డులకు 546 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 65 పంచాయతీలకు 268 మంది సర్పంచ్‌ అభ్యర్థులు, 553 వార్డులకు 1,330 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా చింతపల్లి మండలంలో 65,374, జీకేవీధిలో 52,412, కొయ్యూరు 43,711 మంది మొత్తం 1,61,497 మంది ఓటర్లు ఉన్నారు.

Updated Date - Nov 26 , 2026 | 12:06 AM