అడవిలో అగ్నిజ్వాలలు
ABN , Publish Date - Mar 19 , 2026 | 10:55 PM
లంబసింగి అడవులు వేసవి ప్రారంభంలోనే అగ్నికి ఆహుతవుతున్నాయి. సాధారణంగా వేసవి ప్రారంభంలోనే అడవుల్లో అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు అటవీశాఖ అధికారులు ఫైర్‌లైన్ క్లియరెన్సు పనులు నిర్వహించడంతో పాటు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
దగ్ధమవుతున్న లంబసింగి ఘాట్ అటవీ ప్రాంతం
చింతపల్లి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): లంబసింగి అడవులు వేసవి ప్రారంభంలోనే అగ్నికి ఆహుతవుతున్నాయి. సాధారణంగా వేసవి ప్రారంభంలోనే అడవుల్లో అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు అటవీశాఖ అధికారులు ఫైర్‌లైన్ క్లియరెన్సు పనులు నిర్వహించడంతో పాటు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. లంబసింగి ఘాట్‌లో ఫైర్‌లైన్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఒక చోట నుంచి ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాప్తి చెందుతున్నాయి. బుధ, గురువారాలు బోడకొండమ్మ దేవాలయం దిగువన నాలుగు మలుపుల్లో మంటలు చెలరేగాయి. ఇప్పటికైనా ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎక్కడా నిప్పుపెట్టరాదని, ధూమపానం చేసే వ్యక్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.