Share News

వలసగెడ్డ టేకు ప్లాంటేషన్‌లో ఎగసిన మంటలు

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:18 AM

జీకేవీధి మండలం సీలేరు అటవీశాఖ పరిధిలో గల వలసగెడ్డ టేకు ప్లాంటేషన్‌కు బుధవారం ఉదయం ఆకతాయిలు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి.

వలసగెడ్డ టేకు ప్లాంటేషన్‌లో ఎగసిన మంటలు
మంటలను బ్లోయర్‌ ద్వారా అదుపులోకి తీసుకువస్తున్న సీలేరు అటవీశాఖ సిబ్బంది

ఆకతాయిలు నిప్పుపెట్టడంతో ప్రమాదం

మంటలను అదుపు చేసిన అటవీ అధికారులు

మంటల వేడికి రెండు రాచఎలుకలు మృతి

సీలేరు, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం సీలేరు అటవీశాఖ పరిధిలో గల వలసగెడ్డ టేకు ప్లాంటేషన్‌కు బుధవారం ఉదయం ఆకతాయిలు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల గల గ్రామాల గిరిజనులు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖాధికారులకు సమాచారం ఇవ్వడంతో సీలేరు రేంజ్‌ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్లోయర్‌తో మంటలు అర్పడానికి మూడు గంటల పాటు శ్రమించారు. మంటలు అదుపులోకి రావడంతో అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ మంటల వేడికి రెండు రాచఎలుకలు చనిపోయాయి. కాగా వలసగెడ్డ టేకు ప్లాంటేషన్‌ను 1970 సంవత్సరంలో వేశారు. ఇందులో అడవిదున్నలు, కొండగొర్రెలు, కుందేళ్లు, వానరాలు, వివిధ రకాల పక్షులు ఉన్నాయి.

Updated Date - Apr 02 , 2026 | 12:18 AM