Share News

అరబిందోలో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Oct 24 , 2026 | 01:01 AM

స్థానిక ఫార్మా సిటీలోని అరబిందో పరిశ్రమ యూనిట్‌-15లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రొడక్షన్‌ బ్లాక్‌లో కంప్రెషర్‌ మెషిన్‌ను ఐసోప్రొఫైల్‌ ఆల్కహాల్‌తో శుభ్రం చేస్తుండగా స్టాటిక్‌ ఛార్జ్‌ ఏర్పడి మంటలు వ్యాపించాయి. దీంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. అంతా సురక్షితంగా బయటపడడంతో ఊపరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

అరబిందోలో అగ్ని ప్రమాదం
ప్రమాదం కారణంగా పొగతో నిండిన ప్రొడక్షన్‌ బ్లాక్‌

ఫార్మా సిటీ 15వ యూనిట్‌లో మంటలు, దట్టంగా కమ్ముకున్న పొగ

భయంతో బయటకు పరుగులు తీసిన కార్మికులు

అంతా క్షేమంగా ఉండడంతో ఊరట

పరవాడ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఫార్మా సిటీలోని అరబిందో పరిశ్రమ యూనిట్‌-15లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రొడక్షన్‌ బ్లాక్‌లో కంప్రెషర్‌ మెషిన్‌ను ఐసోప్రొఫైల్‌ ఆల్కహాల్‌తో శుభ్రం చేస్తుండగా స్టాటిక్‌ ఛార్జ్‌ ఏర్పడి మంటలు వ్యాపించాయి. దీంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. అంతా సురక్షితంగా బయటపడడంతో ఊపరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

అరబిందో పరిశ్రమ యూనిట్‌-15లో మెట్‌ఫార్మిన్‌ (షుగర్‌ నియంత్రణ ఔషధం) తయారు చేస్తుంటారు. ఈ బ్లాక్‌లోని కంప్రెషర్‌ మెషిన్‌-16 వద్ద సుమారు 15 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో ఓ కార్మికుడు కంప్రెషర్‌ మెషిన్‌ను ఐసోప్రొఫైల్‌ ఆల్కహాల్‌తో శుభ్రం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్పాటిక్‌ ఛార్జ్‌ (స్థిర విద్యుత్‌ ఆవేశం) ఏర్పడి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న రాంకీ అగ్నిమాపక సిబ్బందితోపాటు అనకాపల్లి అగ్నిమాపక కేంద్రం నుంచి సిబ్బంది వచ్చారు. అయితే బ్లాక్‌లో నుంచి పెద్ద ఎత్తున పొగ రావడంతో లోపలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సుమారు గంటన్నర తరువాత పొగ తీవ్రత తగ్గడంతో అగ్నిమాపక సిబ్బంది లోపలికి మంటలను, పొగను అదుపు చేశారు. ప్రమాదం కారణంగా ప్రొడక్షన్‌ బ్లాక్‌ అంతా పొగబారింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల శాఖ అధికారులు, సీఐ ఎల్‌.భాస్కరరావు వచ్చి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Oct 24 , 2026 | 01:01 AM