ముగిసిన సర్
ABN , Publish Date - Jul 24 , 2026 | 11:14 PM
ఈఏడాది జూన్ 14వ తేదీన మొదలైన ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ శుక్రవారం నాటికి ముగిసింది.
జిల్లాలో 4,36,481 మంది ఓటర్లు డిజిటలైజేషన్ పూర్తి
34,785 మంది మృతులు, 2,328 మంది గుర్తించని ఓటర్లు
వివిధ కారణాలతో స్వీకరించని ఫారాలు 63,271
ఈనెల 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ
అక్టోబరు 3న తుది ఓటరు జాబితా ప్రకటన
పాడేరు, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఈఏడాది జూన్ 14వ తేదీన మొదలైన ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ శుక్రవారం నాటికి ముగిసింది. జిల్లాలోని పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మొత్తం పదకొండు మండలాల పరిధిలో 4,99,752 మంది ఓటర్లుండగా.. సర్ ప్రక్రియలో 4,36,481 మంది ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ చేశారు. కాగా 63,271 మందికి సంబంధించిన ఫారాలు వివిధ కారణాలతో తిరిగి స్వీకరించలేదు. జిల్లా వ్యాప్తంగా 34,785 మంది మృతులు, 2,328 మంది గుర్తించని ఓటర్లు, 14,317 మంది శాశ్వతంగా వలస పోయిన ఓటర్లు, 39 మంది ఇతరులున్నట్టు అధికారులు గుర్తించారు. జిల్లాలోని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో 2,48,665 ఓటర్లకు గానూ 2,14,932 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ చేశారు. అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో 2,51,085 మంది ఓటర్లకు గానూ 2,21,485 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ జరిగాయి. ఈనెల 31న ముసాయిదా ఓటరు జాబితాల ప్రదర్శన, 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటరు జాబితాలో అభ్యంతరాల స్వీకరిస్తారు. వీటని పరిశీలన జరిపి సెప్టెంబరు 28 నాటికి అధికారులు పరిష్కరిస్తారు. ఆయా ప్రక్రియలు పూర్తి చేసి ఈ ఏడాది అక్టోబరు 3న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు.