అనకాపల్లి, నర్సీపట్నంలో ఓటర్ల తుది జాబితాలు విడుదల
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:58 AM
మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)కు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అనకాపల్లి జోన్ పరిధిలో ఓటర్ల తుది జాబితాలను జోనల్ కమిషనర్ కె.చక్రవర్తి గురువారం ఇక్కడ విడుదల చేశారు. మొత్తం 76,950 మంది ఓటర్లు ఉన్నారు.
అనకాపల్లి టౌన్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)కు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అనకాపల్లి జోన్ పరిధిలో ఓటర్ల తుది జాబితాలను జోనల్ కమిషనర్ కె.చక్రవర్తి గురువారం ఇక్కడ విడుదల చేశారు. మొత్తం 76,950 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 37,068, మహిళలు 39,880, ఇతరులు ఇద్దరు ఉన్నారు. మొత్తం ఓటర్లలో బీసీలు 61,015 మంది (79.29 శాతం) ఉండగా వీరిలో పురుషులు 29,349, మహిళలు 31,664 మంది ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 5,236 మంది ఉండగా.. వీరిలో పురుషులు 2,468, మహిళలు 2,768 మంది వున్నారు. ఎస్టీ ఓటర్లు 205 మంది వుండగా.. వీరిలో పురుషులు 103, మహిళలు 102 మంది ఉన్నారు. ఓసీ ఓటర్లు 10,494 మంది వుండగా, వీరిలో పురుషులు 5,148, మహిళలు 5346 మంది ఉన్నారు.
నర్సీపట్నంలో...
నర్సీపట్నం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): స్థానిక మునిసిపాలిటీలో తుది ఓటరు జాబితాలను కమిషనర్ జంపా సరేంద్ర గురువారం విడుదల చేశారు. మునిసిపాలిటీలోని 40 వార్డుల్లో 49,099 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 23,317, మహిళలు 25,778, ఇతరులు నలుగురు ఉన్నారు. బీసీ ఓటర్లు 36,326 మంది (73.98 శాతం) వుండగా.. వీరిలో పురుషులు 17,194, మహిళలు 19,124, ఇతరులు నలుగురు ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 4,960 మంది ఉండగా వీరిలో పురుషులు 2,276, మహిళలు 2,684 ఉన్నారు. ఎస్టీ ఓటర్లు 743 మందికిగాను పురుషులు 344, మహిళలు 399 మంది ఉన్నారు. ఓసీ ఓటర్లు 7,070 మంది వుండగా.. వీరిలో పురుషులు 3,499, మహిళలు 3571 మంది ఉన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఈ ఓటరు జాబితాలతోనే మునిసిపల్ ఎన్నికలు జరుగుతాయని కమిషనర్ తెలిపారు. ఓటరు జాబితాల విడుదల కార్యక్రమంలో టీపీవో సత్యనారాయణ, డీఈఈ కామేశ్వరరావు, మేనేజర్ నాగరాజు, ఆర్వో నీలిమ తదితరులు పాల్గొన్నారు.