షైనింగ్ స్టార్స్‌కు సత్కారం
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:58 PM
జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్- 2026 కార్యక్రమాన్ని సోమవారం ఎస్‌ఆర్ శంకరన్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.
టెన్త్, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన 44 మంది విద్యార్థులకు పురస్కారాలు
అంకిత భావంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జేసీ దిశానిర్దేశం
పాడేరురూరల్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్- 2026 కార్యక్రమాన్ని సోమవారం ఎస్‌ఆర్ శంకరన్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులను షైనింగ్ స్టార్స్‌కు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. పదవ తరగతిలో 27 మంది, ఇంటర్మీడియట్‌లో 17 మంది కలిపి మొత్తం 44 మంది షైనింగ్ స్టార్స్‌కు ఎంపిక కాగా, ఈ కార్యక్రమాన్ని జేసీ టి.శ్రీపూజ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే నిరంతర శ్రమ, అంకిత భావం, సరైన ప్రణాళిక అవసరమన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖా మంత్రి లోకేశ్ ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమన్నారు. జిల్లా వ్యాప్తంగా టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన పాడేరు మండలానికి చెందిన ఎ.శ్రీవందన్, బి.గాయత్రి, రవి నవీన్, ఎస్.సోమేశ్, పి.మానస్, ఆర్‌ఎల్‌ఎస్ వరప్రసాద్, చింతపల్లి మండలానికి చెందిన జి.భవిష్యకాట్వి, డి.స్నేహలత, పి.పూజిత దుర్గ, జి.లక్ష్మీ ప్రియరాజు, వి.ప్రణతిరూప, పి.చైత్ర, జీకేవీధి మండలానికి చెందిన జి.సాయి రమాకాంత్, ఎల్.ప్రియాంక, కె.వెంకటలక్ష్మి, ఎల్‌ఆర్‌బీ కామేశ్, పి.ధార స్మైలి, పెదబయలు మండలానికి చెందిన కె.శ్రీ, జె.ఎలియా, ఎ.మాధురి, అనంతగిరి మండలానికి చెందిన ఆర్.పార్థసారథి, జె.నర్సింగరావు, డుంబ్రిగుడ మండలానికి చెందిన ఎస్.అనూష, జి.మాడుగుల మండలానికి చెందిన ఎస్.నాని, కొయ్యూరు మండలానికి చెందిన జి.సంతోశ్, ముంచంగిపుట్టు మండలానికి చెందిన పి.దేవిలను ఘనంగా సత్కరించి గోల్డ్ మెడల్, సర్టిఫికెట్‌తో పాటు రూ.20 వేల నగదు బహుమతులను జేసీ అందించారు. విద్యార్థులతో జేసీ మాట్లాడి వారి లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఈవో పీబీకే పరిమళ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి ఎస్.భీమశంకరరావు, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, ఆర్డీవో భుజంగరావు, ఎంఈవోలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, జీసీసీ డైరెక్టర్ బి.నాగరాజు, ఎంపీపీ ఎస్.రత్నకుమారి, మాజీ ఎంపీపీలు బి.విజయరాణి, ఎస్వీ.రమణమూర్తి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.