Share News

వేగవంతంగా వినతుల పరిష్కారం

ABN , Publish Date - Mar 13 , 2026 | 10:52 PM

మీకోసం కార్యక్రమంలో ప్రజలు సమర్పించే వినతుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేడ్కర్‌ పేర్కొన్నారు.

వేగవంతంగా వినతుల పరిష్కారం
ఐటీడీఏ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న డీఆర్‌వో పి.అంబేడ్కర్‌

జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేడ్కర్‌ ఆదేశం

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌లో 77 వినతులు స్వీకరణ

పాడేరు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): మీకోసం కార్యక్రమంలో ప్రజలు సమర్పించే వినతుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేడ్కర్‌ పేర్కొన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(మీకోసం)లో గిరిజనుల నుంచి అధికారులు 77 వినతులను స్వీకరించారు. ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ బి.నీలకంఠంతో కలిసి డీఆర్‌వో ఈవారం పీజీఆర్‌ఎస్‌ను నిర్వహించారు. మీకోసంలో అర్జీలు దాఖలు చేసిన వ్యక్తులు తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోకుంటే 1100 నంబర్‌కు ఫోన్‌ చేసి సేవలు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌వో అంబేడ్కర్‌ సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నందు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రమణారావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే.పరిమిళ, జలవనరుల శాఖ డీఈఈ నాగేశ్వరరావు, ఎల్‌డీఎం మాతునాయుడు, జాతీయ రహదారుల విభాగం డీటీ వి.ధర్మరాజు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 10:52 PM