రైతుబజారు సక్సెస్
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:47 AM
రైతుబజారు అందుబాటులోకి రావడం, ప్రైవేటు దుకాణాలతో పోలిస్తే కూరగాయల ధరలు బాగా తక్కువగా వుండడం, తాజా కూరగాయలు లభిస్తుండడంతో పట్టణవాసులు చాలా ఆనందంగా వున్నారు. స్థానిక ఎన్టీఆర్ మార్కెట్‌యార్డులో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుబజారును గత మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. మొత్తం వంద స్టాళ్లు వుండగా.. వీటిలో 72 స్టాళ్లను రైతులకు, 25 స్టాళ్లను డ్వాక్రా సంఘాలకు, మూడింటిని దివ్యాంగులకు కేటాయించారు. కానీ పూర్తిస్థాయిలో రైతులు రావడం ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం అనకాపల్లి మండలం గోపాలపురం, మునగపాక మండలం గణపర్తి, కె.కోటపాడు మండలం సింగన్నదొరపాలెం, దాలివలస, దేవరాపల్లి మండలం వెంకటరాజపురం, పరవాడ మండలం తానాం తదితర ప్రాంతాల నుంచి రైతులు కూరగాయలు, ఆకు కూరలను తీసుకువచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు.
అనకాపల్లిలో పెరిగిన ఆదరణ
బయట మార్కెట్‌తో పోలిస్తే 30-40 శాతం తక్కువ ధరకు కూరగాయలు లభ్యం
తాజా సరుకు కావడంతో కొనుగోలుదారుల ఆసక్తి
అనకాపల్లి టౌన్, మే 31 (ఆంధ్రజ్యోతి): రైతుబజారు అందుబాటులోకి రావడం, ప్రైవేటు దుకాణాలతో పోలిస్తే కూరగాయల ధరలు బాగా తక్కువగా వుండడం, తాజా కూరగాయలు లభిస్తుండడంతో పట్టణవాసులు చాలా ఆనందంగా వున్నారు. స్థానిక ఎన్టీఆర్ మార్కెట్‌యార్డులో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుబజారును గత మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. మొత్తం వంద స్టాళ్లు వుండగా.. వీటిలో 72 స్టాళ్లను రైతులకు, 25 స్టాళ్లను డ్వాక్రా సంఘాలకు, మూడింటిని దివ్యాంగులకు కేటాయించారు. కానీ పూర్తిస్థాయిలో రైతులు రావడం ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం అనకాపల్లి మండలం గోపాలపురం, మునగపాక మండలం గణపర్తి, కె.కోటపాడు మండలం సింగన్నదొరపాలెం, దాలివలస, దేవరాపల్లి మండలం వెంకటరాజపురం, పరవాడ మండలం తానాం తదితర ప్రాంతాల నుంచి రైతులు కూరగాయలు, ఆకు కూరలను తీసుకువచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు. బయట మార్కెట్ ధరలతో పోల్చితే రైతుబజారులో కూరగాయల ధరలు తక్కువగా ఉన్నాయని వినియోగదారులు అంటున్నారు. ప్రైవేటు దుకాణాల్లో బీరకాయలు కిలో రూ.50కి అమ్ముతుండగా.. రైతుబజారులో రూ.30కే లభిస్తున్నాయి. బంగాళదుంపలు బయట మార్కెట్‌లో రూ.20 కాగా రైతుబజారులో రూ.15కు అమ్ముతున్నారు. బెండకాయలు కిలో రూ.40లు కాగా రైతుబజారులో రూ.26, దొండకాయలు కిలో రూ.30కాగా, రైతుబజారులో రూ.20కి అమ్ముతున్నారు. బయట ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే క్యారట్, టమాటా, బీన్స్, బీట్‌రూట్, క్యాబేజీ, క్యాప్సికమ్ వంటి కూరగాయల ధరలు బయట మార్కెట్‌కు, రైతుబజారుకు రూ.5 నుంచి రూ.10 వరకు తేడా వుంది.
తక్కువ ధరకే కూరగాయలు..
పాతాల సీత, అనకాపల్లి 31ఎకెపిటౌన్-16-
రైతుబజారులో కూరగాయల ధరలు బయట మార్కెట్‌లో కంటే తక్కువ ధరకు లభిస్తున్నాయి. వారానికి సరిపడ కూరగాయలను కొనుగోలు చేశాను. ఇవి కూరగాయలను బయట దుకాణాల్లో కొనుగోలు చేస్తే 30 నుంచి 40 శాతం మేర అధికంగా చెల్లించాల్సి వచ్చేది. తమలాంటి పేదలకు కూరగాయలు తక్కువ ధరకు లభించడం ఆనందంగా ఉంది.