Share News

పాము కాటుతో రైతు మృతి

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:37 AM

పాము కాటుకు గురై ఒక రైతు మృతి చెందిన ఘటన మంగళవారం దేవరాపల్లిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన గేదెల పైడంనాయుడు అనే రైతు మంగళవారం ఉదయం సంతతోట సమీపంలో ముత్యాలమ్మ చెరువు వద్ద వరి చేనులో కలుపు తీస్తుండగా పాము కాటు వేసింది.

పాము కాటుతో రైతు మృతి
గేదెల పైడంనాయుడు (ఫైల్‌ ఫొటో)

దేవరాపల్లి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పాము కాటుకు గురై ఒక రైతు మృతి చెందిన ఘటన మంగళవారం దేవరాపల్లిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన గేదెల పైడంనాయుడు అనే రైతు మంగళవారం ఉదయం సంతతోట సమీపంలో ముత్యాలమ్మ చెరువు వద్ద వరి చేనులో కలుపు తీస్తుండగా పాము కాటు వేసింది. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. సమీపంలో ఉన్న మరో రైతు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు 108 వాహనంలో దేవరాపల్లి పీహెచ్‌సీకి తీసుకు వెళ్లారు. అయితే అతను అప్పటికే మృతి చెందాడు. అతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు పవన్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కె.కోటపాడు సీహెచ్‌సీకి తరలించారు.

Updated Date - Sep 30 , 2026 | 12:37 AM