Share News

విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:37 AM

మండలంలోని పెదరాంభద్రపురంలో తమలపాకు తోటలో పనిచేయడానికి వెళ్లిన ఓ కూలీ.. విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. తోటలో తెగిపడిన విద్యుత్‌ వైర్లు అతని ప్రాణాలు తీశాయని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి అందిన ఫిర్యాదు మేరకు సీఐ వినోద్‌బాబు అందించిన వివరాలిలా వున్నాయి.

విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి
మృతిచెందిన మల్లేశ్వరరావు

పాయకరావుపేట రూరల్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెదరాంభద్రపురంలో తమలపాకు తోటలో పనిచేయడానికి వెళ్లిన ఓ కూలీ.. విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. తోటలో తెగిపడిన విద్యుత్‌ వైర్లు అతని ప్రాణాలు తీశాయని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి అందిన ఫిర్యాదు మేరకు సీఐ వినోద్‌బాబు అందించిన వివరాలిలా వున్నాయి.

మండలంలోని సత్యవరం గ్రామానికి చెందిన గేదెల మల్లేశ్వరరావు పొలం పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం పెదరాంభద్రపురంలో దాడి గోపికి చెందిన తోటలో తమలపాకులు కోసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో విద్యుత్‌ స్తంభం నుంచి వైరు తెగి మల్లేశ్వరరావు మీద పడింది. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సహచర కూలీలు ఈ విషయాన్ని తోట యజమాని ద్వారా పోలీసులకు తెలిపరిచారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని నక్కపల్లి సీహెచ్‌సీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ అలీ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్దదిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున బంధువులు వాపోయారు.

Updated Date - Sep 28 , 2026 | 12:37 AM