Share News

రోడ్డుకడ్డంగా కూలిన చెట్టు

ABN , Publish Date - Sep 11 , 2026 | 11:05 PM

సీలేరు-ధారకొండ ప్రధాన రహదారిలో ఎర్రదిబ్బలు సమీపంలో శుక్రవారం ఉదయం రహదారికి అడ్డంగా భారీ చెట్టు కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

రోడ్డుకడ్డంగా కూలిన చెట్టు
సీలేరు-ధారకొండ రహదారిలో అడ్డంగా పడిన భారీ చెట్టు

మూడు గంటలు నిలిచిన రాకపోకలు

ఇబ్బందులు పడిన ప్రయాణికులు

సీలేరు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): సీలేరు-ధారకొండ ప్రధాన రహదారిలో ఎర్రదిబ్బలు సమీపంలో శుక్రవారం ఉదయం రహదారికి అడ్డంగా భారీ చెట్టు కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురువారం మధ్యాహ్నం నుంచి భారీగా వర్షం కురవడంతో ఎర్రదిబ్బలు సమీపం మలుపు వద్ద రహదారి పక్కనే ఉన్న భారీ చెట్టు కూలిపోయింది. దీంతో సీలేరు-నర్సీపట్నం, సీలేరు నుంచి ఒడిశాకు వెళ్లే పలు వాహనాలు ఉదయం తొమ్మిది నుంచి 12 గంటల వరకు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానికులు ఆర్‌అండ్‌బీ అధికార్లకు సమాచారం ఇవ్వడంతో చెట్టును నరికించి మధ్యాహ్నం 12 గంటలకు రాకపోకలను పునరుద్ధరించారు.

Updated Date - Sep 11 , 2026 | 11:05 PM