Share News

మార్కెట్‌లో నకిలీ వైజాగ్‌ స్టీల్‌

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:50 AM

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు తయారు చేసే ‘వైజాగ్‌ టీఎంటీ’ బ్రాండ్‌కు డూప్లికేట్‌ స్టీల్‌ తయారుచేసి కొందరు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.

మార్కెట్‌లో నకిలీ వైజాగ్‌ స్టీల్‌

కొరతను సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు

చర్యలకు యూనియన్ల డిమాండ్‌

విశాఖపట్నం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు తయారు చేసే ‘వైజాగ్‌ టీఎంటీ’ బ్రాండ్‌కు డూప్లికేట్‌ స్టీల్‌ తయారుచేసి కొందరు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. దీనిపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. యాజమాన్యం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

నిర్మాణ రంగంలో ఉపయోగించే టీఎంటీ బార్లను విశాఖ స్టీల్‌ప్లాంటు తయారుచేస్తోంది. వీటిని ‘వైజాగ్‌ టీఎంటీ 550 డి’ లోగోతో మూడు దశాబ్దాలుగా మార్కెట్‌లో విక్రయిస్తోంది. ఇటీవల ప్లాంటులో నెలకొన్ని పరిస్థితుల కారణంగా గ్యాస్‌ ఉత్పత్తి తగ్గిపోయి స్టీల్‌ బ్లూమ్స్‌ నుంచి టీఎంటీ బార్ల తయారీ గణనీయంగా పడిపోయింది. దీంతో మార్కెట్‌లో సరకు కొరత ఏర్పడింది. దీనిని ఆసరాగా తీసుకొని రాయపూర్‌కు చెందిన కొన్ని కంపెనీలు ‘వైజాగ్‌ 550 డి టీఎంటీ’ లోగోతో నకిలీ స్టీల్‌ను ఉత్పత్తి చేసి ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీగా విక్రయిస్తోంది. ఈ విషయం కార్మిక సంఘాల దృష్టికి రావడంతో వెంటనే యాజమాన్యానికి తెలియజేశారు.

ప్రస్తుతం స్టీల్‌ప్లాంటులో పది లక్షల టన్నుల బ్లూమ్స్‌ ఉన్నాయి. గతంలో వీటిని టీఎంటీ బార్లుగా మార్చడానికి పలు ప్రైవేటు సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు వారిని పిలిచి బ్లూమ్స్‌ను బార్లుగా మార్చి మార్కెట్‌లోకి విడుదల చేయాలని కార్మిక సంఘ నాయకుడు అయోధ్యరామ్‌ డిమాండ్‌ చేశారు. అప్పుడు నకిలీ బాధ తప్పడంతో పాటు ప్లాంటుకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుదన్నారు. యాజమాన్యం స్పందించి నకిలీలపై చర్యలు తీసుకోకుంటే తామే ఫిర్యాదు చేస్తామన్నారు.


ఏయూలో ఏం జరుగుతోంది?

మాజీ వీసీ ప్రసాదరెడ్డి సహా మరో నలుగురి సస్పెన్షన్‌ తరువాత కీలక చర్చ

విజిలెన్స్‌ నివేదికలో మరింతమంది ఉద్యోగుల పాత్రపైనా తీవ్ర అభియోగాలు

ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణ కమిటీ ఏర్పాటు

విశాఖపట్నం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి):

గత ప్రభుత్వ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని అక్రమాలకు కేంద్రంగా మార్చిన మాజీ వీసీ ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాదరెడ్డి, మరో ముగ్గురు ప్రొఫెసర్లు, ఒక సీని యర్‌ అసిస్టెంట్‌ను సస్పెండ్‌ చేసిన తరువాత ఏం జరుగుతుందన్న చర్చ వర్సిటీలో జోరుగా సాగుతోంది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో భారీగా నిధుల దుర్వి నియోగం, అడ్డగోలు నిర్ణయాలు, నిబంధనలకు విరు ద్ధంగా అస్మదీయులకు పదవులు కట్టబెట్టడం, వంటి అనే క అంశాలపై ఆరోపణలు వెల్లువెత్తడంతో విచారణ చేపట్టిన విజిలెన్స్‌ అధికారులు 45 మందిపై అభియోగాలను మోపారు. తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురిని వర్సిటీ అధికారులు సస్పెండ్‌ చేయగా, మిగిలిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది.

విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా తీసుకుంటున్న చర్యల విషయంలో వర్సిటీ అధికారులు అత్యంత గోప్యత పాటిస్తు న్నారు. తాజాగా సస్పెన్షన్‌కు గురైన ఉద్యోగుల ను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. శాఖాపరమైన విచారణ కు ప్రత్యేకంగా కమిటీని నియమించనున్నట్టు సమాచారం. సదరు ఉద్యోగులు నుంచి వివరణ తీసుకుని, తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంతకుముందే ప్రభుత్వం ఈ వ్యవహారంలో కఠి చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది.

విజిలెన్స్‌ సిఫార్సులు అమలుచేస్తారా?

విజిలెన్స్‌ నివేదికలో అధికారులు అనేక అంశాలను పొందుపర్చినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో మొత్తంగా 45 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచిం చగా, ఇప్పటికి ఐదుగురిని మాత్రమే సస్పెండ్‌ చేశారు. భారీగా నిధులు దుర్వినియోగం చేసిన విషయాన్ని విజి లెన్స్‌ తేల్చింది. ఈ నిధుల రికవరీకి సంబంధించి ఎటు వంటి చర్యలు చేపడతారోననే చర్చ జరుగుతోంది. పరీక్ష ల్లో అక్రమాలకు పాల్పడిన కొందరికి లబ్ధి చేకూర్చినట్టు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. ఆ విద్యార్థుల విషయం లో ఏదైనా నిర్ణయం ఉంటుందా.? అన్నది చూడాల్సి ఉంది. షార్ట్‌ టెండర్ల వల్ల వర్సిటీకి కలిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు అనుగుణంగా న్యాయపరమైన చర్యలకు వర్సిటీ అధికారులు సిద్ధమవుతారా.? అన్నది చూడాల్సి ఉంది. వీటితోపాటు అనేక అంశాలపైనా విజిలెన్స్‌ కీలక విషయాలను పొందుపర్చింది. మరి వాటిపై వర్సిటీ అధి కారులు చర్యలు తీసుకుంటారా.? లేదా.? అన్నదానిపై జోరుగా చర్చ జరుగుతోంది.


విదేశాలకు కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌

జేసీ విద్యాధరికి బాధ్యతల అప్పగింత

విశాఖపట్నం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి):

జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ ఆదివారం నుంచి మూడురోజుల సెలవుపై విదేశాలకు వెళ్లారు. తిరిగి ఈనెల ఐదో తేదీన విధుల్లో చేరుతారు. ఈ మూడురోజులు కలెక్టర్‌ బాధ్యతలను జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ళ విద్యాధరి నిర్వరిస్తారు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కా వేదిక కార్యక్రమం జేసీ ఆధ్వర్యంలో జరగనున్నది.

Updated Date - Aug 03 , 2026 | 12:50 AM