Share News

ఉచిత సివిల్స్‌ కోచింగ్‌కు విశేష స్పందన

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:31 PM

ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత సివిల్స్‌ కోచింగ్‌కు గిరిజన నిరుద్యోగుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.

ఉచిత సివిల్స్‌ కోచింగ్‌కు విశేష స్పందన
ఐటీడీఏ కార్యాలయంలో హాల్‌ టికెట్లకు బారులు తీరిన అభ్యర్థులు

జోరుగా హోల్‌ టికెట్లు పంపిణీ...

19న రాత పరీక్ష

పాడేరు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత సివిల్స్‌ కోచింగ్‌కు గిరిజన నిరుద్యోగుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. కోచింగ్‌ కోసం అర్హులైన 1,119 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారికి ఈనెల 19న జిల్లా కేంద్రంలో రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈక్రమంలో తమ హాల్‌టికెట్లను పొందేందుకు ఐటీడీఏ కార్యాలయం ఎదుట బారులుతీరారు. అయితే శనివారం నాటికి హాల్‌ టికెట్‌ల జారీ ప్రక్రియను పూర్తి చేసి, 19న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాతపరీక్షలో ప్రతిభ చూపిన వంద మంది అభ్యర్థులను ఎంపిక చేసి, వారికి 11 నెలలు ఉచిత భోజన,వసతి కల్పిస్తూ వేపగుంటలోని గిరిజన సంక్షేమ శాఖ యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో సివిల్స్‌ కోచింగ్‌ అందిస్తారు.

Updated Date - Jul 17 , 2026 | 11:31 PM