మందుల సరఫరాకు డ్రోన్ సేవల పరిశీలన
ABN , Publish Date - Oct 25 , 2026 | 11:50 PM
జిల్లాకు కేటాయించిన నూతన మెడికల్ డ్రోన్ పనితీరును కలెక్టర్ టి.నిషాంతి ఆదివారం పరిశీలించారు.
పాడేరు, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లాకు కేటాయించిన నూతన మెడికల్ డ్రోన్ పనితీరును కలెక్టర్ టి.నిషాంతి ఆదివారం పరిశీలించారు. ఇప్పటికే జిల్లాలో మెడికల్ డ్రోన్ ద్వారా మందులు, రక్త నమూనాలను ప్రయోగాత్మకంగా జిల్లా ఆస్పత్రి నుంచి పలు పీహెచ్‌సీలకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా మరింత ఆధునిక సదుపాయాలతో పాటు వీడియో కాలింగ్ సదుపాయం కలిగిన నూతన డ్రోన్‌ను జిల్లాలకు కేటాయించారు. దానిని ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రయోగాత్మకంగా ఎగురవేసి పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల పరిశీలకుడు రోణంకి కూర్మనాఽథ్, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి రియాజ్‌బేగ్, జిల్లా టూరిజం అధికారి టి.చలపతిరావు, డ్రోన్ ఆపరేటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.