త్వరితగతిన రెవెన్యూ సేవలు
ABN , Publish Date - Sep 11 , 2026 | 12:50 AM
రెవెన్యూ సేవల్లో ప్రజల సంతృప్తిస్థాయిని పెంచేందుకు అధికారులు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ అన్నారు. జిల్లాలో రెవెన్యూ అంశాలపై ఆ శాఖధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రెవెన్యూ సేవలకు సంబంధించిన ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే వుందన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ సకాలంలో జరగాలని, ఎంపిక చేసిన గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది డిసెంబరునాటికి పూర్తి చేయాలన్నారు.
ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలి
భూముల రీసర్వేను గడువులోగా పూర్తిచేయండి
రెవెన్యూ అధికారులకు జేసీ శ్రీపూజ ఆదేశం
పాడేరు, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సేవల్లో ప్రజల సంతృప్తిస్థాయిని పెంచేందుకు అధికారులు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ అన్నారు. జిల్లాలో రెవెన్యూ అంశాలపై ఆ శాఖధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రెవెన్యూ సేవలకు సంబంధించిన ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే వుందన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ సకాలంలో జరగాలని, ఎంపిక చేసిన గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది డిసెంబరునాటికి పూర్తి చేయాలన్నారు. రీసర్వే వివరాలను తొలుత సబ్‌కలెక్టర్ కార్యాలయానికి పంపించి రికార్డుల పరిశీలన జరగాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని చెప్పారు. పీజీఆర్‌ఎస్‌లో అందిన అర్జీలను పెండింగ్‌లో వుంచకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో సీఎం, డిప్యూటీల స్పందన ప్రక్రియలో నాణ్యత, సంతృప్తి శాతాన్ని పెంచాలన్నారు. ఎక్కడైనా ఐవీఆర్‌ఎస్‌లో సంతృప్తికర సేవలు అందని పరిస్థితులుంటే సంబంధిత తహశీల్దారు కలెక్టరేట్‌కు హాజరు కావాలన్నారు. భూముల మ్యుటేషన్ ప్రక్రియ పక్కగా జరగాలని, జనన/ మరణ ధ్రువపత్రాలను నిర్ణీత గడువులోగా దరఖాస్తుదారులకు జారీ చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు, ఆర్‌డీవో ఎం.భుజంగరావు, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి వి.మోహనరావు, అన్ని మండలాల తహశీల్దార్లు, సర్వేయర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.