త్వరితగతిన జన్‌మన్ గృహ బిల్లుల చెల్లింపు
ABN , Publish Date - Oct 13 , 2026 | 12:06 AM
జి.మాడుగుల మండలంలో పీఎం జన్‌మన్ గృహ బిల్లులు వెంటనే చెల్లించాలని సంబంధిత అధికారులను ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆదేశించారు.
అధికారులకు ఐటీడీఏ పీవో ఆదేశం
పాడేరురూరల్, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): జి.మాడుగుల మండలంలో పీఎం జన్‌మన్ గృహ బిల్లులు వెంటనే చెల్లించాలని సంబంధిత అధికారులను ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆదేశించారు. సోమవారం ఆయన జి.మాడుగుల మండలంలోని కె.కోడాపల్లి, పాలమామిడి పంచాయతీ పీవీటీజీ గ్రామాల్లో పర్యటించి గ్రామస్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పీఎం జన్‌మన్ గృహ నిర్మాణ పనులు పరిశీలించిన ఆయన పెండింగ్ బిల్లుల విడుదలపై గృహనిర్మాణ శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి పౌష్టికాహారం అందుతున్న విధానంపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు పీవోను కోరారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడిన ఆయన మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. సీసీ రోడ్లు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. కాఫీ రైతులతో మాట్లాడి రైతులకు అందుతున్న రాయితీలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో(పీవీటీజీ)ఎం.వెంకటేశ్వరరావు, ఐసీడీఎస్ పీవో కె.దేవి, కాఫీ ఏఈవో, లైజన్ వర్కర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.