సర్ పెండింగ్ ప్రక్రియలు త్వరితగతిన పూర్తి
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:33 AM
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రక్రియలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో వివేక్‌యాదవ్ ఆదేశించారు.
అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో వివేక్‌యాదవ్ ఆదేశం
ఓటరు జాబితాల సవరణలపై నిత్యం పర్యవేక్షణ: కలెక్టర్ టి.నిషాంతి
పాడేరు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రక్రియలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో వివేక్‌యాదవ్ ఆదేశించారు. సర్, ఎన్నికల సంబంధ అంశాలపై జిల్లా అధికారులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితాల ప్రత్యేక సవరణకు సంబంధించిన పెండింగ్ ప్రక్రియలను గడువు నాటికి పూర్తి చేయాలన్నారు. అలాగే బూత్‌స్థాయి అధికారులు చేపట్టిన చర్యలపై ఆయన సమీక్షించారు. జిల్లాలో మృతులు, గుర్తింపునకు లభించని, వలస వెళ్లిన ఓటర్లు 63,258 ఉన్నారని, వాటిని పునఃసమీక్ష చేయాలన్నారు. అర్హులైన ఏ ఓటరుకు అన్యాయం జరగకూడదని, అనర్హులకు ఓటరు జాబితాలో స్థానం కల్పించకూడదన్నారు. బూత్‌స్థాయి అధికారులు ఓటరు జాబితాల సవరణపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పక్కాగా చేపట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రక్రియలను గడువునాటికి పూర్తి చేసి డిసెంబరు 22న తుది ఓటరు జాబితాను ప్రకటించేందుకు సిద్ధం కావాలని ఎన్నికల సంఘం సీఈవో వివేక్‌యాదవ్ ఆదేశించారు.
సర్ ప్రక్రియపై నిత్యం పర్యవేక్షణ
జిల్లాలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై నిత్యం పర్యవేక్షిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి వీడియో కాన్పరెన్స్‌లో పేర్కొన్నారు. సంబంధిత అధికారులతో సమీక్షలు, రాజకీయ పార్టీల ప్రతినిఽధులతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే అందని క్లైమ్ల పరిశీలన, పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. పెండింగ్‌లో ఉన్న అభ్యర్థనలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, నిర్దేశించిన సమయానికి ఆయా ప్రక్రియలను పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, సబ్ కలెక్టర్ కె.సాహిత్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరావు పాల్గొన్నారు.