మండలాధ్యక్షుల ఎన్నికకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Nov 19 , 2026 | 01:18 AM
జిల్లాలో నాలుగు మండలాలకు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక గురువారం జరగనున్నది. మండల పరిషత్ కార్యాలయాల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ఇందుకోసం ఆయా మండలాలకు ప్రిసైడింగ్ అధికారులను నియమించా మన్నారు. మొదట కో-ఆప్టెడ్ సభ్యుని ఎన్నిక, అనంతరం ఎంపీపీ, ఆ తరువాత వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈనెల 20వ తేదీన జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, ఇద్దరు కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఉపాధ్యక్షులు, కో-ఆప్షన్ సభ్యులు కూడా...
నేడే ప్రక్రియ
నాలుగు మండలాలకు ఎంపీపీలు ఖరారు
జడ్పీ చైర్మన్ ఎన్నిక రేపు
విశాఖపట్నం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో నాలుగు మండలాలకు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక గురువారం జరగనున్నది. మండల పరిషత్ కార్యాలయాల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ఇందుకోసం ఆయా మండలాలకు ప్రిసైడింగ్ అధికారులను నియమించా మన్నారు. మొదట కో-ఆప్టెడ్ సభ్యుని ఎన్నిక, అనంతరం ఎంపీపీ, ఆ తరువాత వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈనెల 20వ తేదీన జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, ఇద్దరు కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.
కాగా జిల్లాలోని నాలుగు మండలాలకు అధ్యక్షుల ఎంపిక దాదాపు పూర్తయ్యింది. ఆనందపురం మండల పరిషత్ అధ్యక్షుడిగా బోని ఎంపీటీసీ సభ్యుడు తాట్రాడు అప్పారావు (టీడీపీ), భీమిలి ఎంపీపీగా టీడీపీకి చెందిన మూలకుద్దు ఎంపీటీసీ సభ్యురాలు ఎరబాల కృష్ణవేణి, పద్మనాభం ఎంపీపీగా తెలుగుదేశం నుంచి కృష్ణాపురం ఎంపీటీసీ సభ్యునిగా ఎన్నికైన కుచ్చర్లపాటి అరుణకుమారి, పెందుర్తి ఎంపీపీగా జనసేనకు చెందిన పినగాడి ఎంపీటీసీ (జనసేన) మడక సంతోషికుమారి ఎన్నిక కానున్నారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో-ఆప్టెడ్ సభ్యులపేర్లను టీడీపీ, జనసేన జిల్లా అధ్యక్షులు ఆయా మండల ప్రిసైడింగ్ అధికారులకు అందజేశారు.
జడ్పీ చైర్మన్ పేరు ఖరారు రేపు
జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, కో-ఆప్టెడ్ సభ్యుల పేర్లు గురువారం ఖరారయ్యే అవకాశం ఉంది. జిల్లాలో నలుగురు జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. వీరిలో ముగ్గురు టీడీపీ, ఒకరు జనసేనకు చెందినవారు. చైర్మన్ రేస్‌లో టీడీపీ నుంచి గాడు అలివేణి (భీమిలి), సుఖవాసి అజయ్ (పెందుర్తి) ఉన్నారు. ఇద్దరు కూడా ఎవరి ప్రయత్నంలో వారు ఉన్నారు. అయితే విజయనగరం మేయర్ పదవి నాగవంశం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చినందున విశాఖ జడ్పీ చైర్మన్ పదవి ‘నగరాలకు’ ఇవ్వాలని ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు టీడీపీ అధిష్ఠానాన్ని కోరుతున్నారు.