రిపబ్లిక్ డే వేడుకలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:58 AM
గణతంత్ర దిన వేడుకలకు స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
ఏఆర్ పోలీసులు ట్రయల్ కవాతు
అనకాపల్లి టౌన్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): గణతంత్ర దిన వేడుకలకు స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సోమవారం రాత్రికి ఏర్పాట్లు పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు. స్టేడియం ఆవరణలో ఢిల్లీ ఎర్రకోటను ప్రతిబింబించేలా సెట్ వేశారు. ప్రధాన వేదిక, అతిథుల గ్యాలరీ, సాధారణ ప్రజానీకం కూర్చునే ప్రదేశాల్లో టెంట్లు వేసి, మూడు రంగుల వస్త్రాలతో అలంకరించారు. జిల్లా కలెక్టర్‌కు గౌరవ వందనం కోసం ఆదివారం స్టేడియంలో ఏఆర్ ఇన్‌స్పెక్టర్ల ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ట్రయల్ కవాతు నిర్వహించారు. ఆర్డీవో షేక్ ఆయీషా పర్యవేక్షించారు. సోమవారం ఉదయం 8.45 గంటలకు కలెక్టర్ విజయకృష్ణన్ జాతీయ పతాకాన్ని అవిష్కరించి, జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆర్డీవో చెప్పారు. వేడుకల్లో ప్రగతి ప్రదర్శన కోసం వివిధ ప్రభుత్వ శాఖల నుంచి 20 శకటాలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.