Share News

అన్నీ ఒకేచోట

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:43 AM

మునిసిపల్‌ ఎన్నికల్లో మొదటి ఘట్టమై నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. ఉపసంహరణ అనంతరం ఏ వార్డులో ఎంత మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారో ఎన్నికల అధికారులు జాబితాలను విడుదల చేశారు. దీంతో చైర్‌పర్సన్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

అన్నీ ఒకేచోట
మునిసిపల్‌ ఎన్నికల సామగ్రి పంపిణీ, స్ట్రాంగ్‌ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఎంపిక చేసిన డాన్‌ బాస్కో కళాశాల

నర్సీపట్నం మునిసిపల్‌ ఎన్నికలకు అధికారుల ఏర్పాట్లు

డాన్‌ బాస్కో కళాశాలలో పోలింగ్‌ సామగ్రి

ఇక్కడే పంపిణీ, స్ర్టాంగ్‌ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు

అసాధారణ భద్రత, నిఘా ఏర్పాట్లు

పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు

ఎన్నికల విధుల్లో 700 మంది సిబ్బంది

నర్సీపట్నం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల్లో మొదటి ఘట్టమై నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. ఉపసంహరణ అనంతరం ఏ వార్డులో ఎంత మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారో ఎన్నికల అధికారులు జాబితాలను విడుదల చేశారు. దీంతో చైర్‌పర్సన్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇదిలావుండగా ఎన్నికల సామగ్రి నిల్వ, పంపిణీ కోసం పెదబొడ్డేపల్లిలోని డాన్‌ బాస్కో కళాశాలను అధికారులు ఎంపిక చేశారు. పోలింగ్‌ అనంతరం బ్యాలట్‌ బాక్సులను ఇక్కడే భద్రపరుస్తారు. తరువాత ఓట్ల లెక్కింపు కూడా ఇక్కడే జరుగుతుంది. దీంతో కళాశాలలో పలుచోట్ల... స్ట్రాంగ్‌ రూమ్‌ లోపల, బయట, కౌటింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కోసం నాలుగు వార్డులకు ఒకటి చొప్పున పది టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. ఓటింగ్‌ పూర్తయిన తరువాత పోలింగ్‌ కేంద్రాల నుంచి వచ్చే బ్యాలట్‌ బాక్సులు, ఇతర సామగ్రిని స్వీకరించడానికి సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం మూడు హాళ్లు ఏర్పాటు చేశారు.

ఎన్నికల నిర్వహణలో 700 మంది సిబ్బంది

ఎన్నికల అధికారులు, పోలీసులు, మునిసిపల్‌ సిబ్బంది, ఉద్యోగులు కలిపి మొత్తం 700 మంది విధులు నిర్వహిస్తారని అంచనా వేస్తున్నారు. వీరికిఆయా రోజుల్లో అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేస్తారు. డాన్‌ బాస్కో కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం నుంచి ఎన్నికల మెటీరియల్‌, సిబ్బందిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించడానికి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 76 పోలింగ్‌ కేంద్రాలు వుండగా.. ఒక్కొక్క పోలింగ్‌ కేంద్రంలో పీవో, ఏపీవో, ఓపీవోలు ఆరుగురు చొప్పున మొత్తం 456 మంది విధుల్లో ఉంటారు. వీరు కాకుండా పీవోలు 40 మంది, ఏపీవోలు 40 మంది చొప్పున రిజర్వులో ఉంచుతారు.

Updated Date - Oct 23 , 2026 | 12:43 AM