Share News

ప్రతి ఓటు నమోదు చేయించాలి

ABN , Publish Date - Jun 13 , 2026 | 10:03 PM

అర్హత గల ప్రతి ఒక్కరికి ఓటును నమోదు చేయించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రద్ధ తీసుకోవాలని జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

ప్రతి ఓటు నమోదు చేయించాలి
మాట్లాడుతున్న కిడారి శ్రావణ్‌కుమార్‌

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి

జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌

అనంతగిరి, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): అర్హత గల ప్రతి ఒక్కరికి ఓటును నమోదు చేయించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రద్ధ తీసుకోవాలని జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని కొత్తూరు పంచాయతీ శివలింగపురం ఓ రిసార్ట్స్‌ వద్ద బూత్‌ స్థాయి నాయకులు, టీడీపీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం చేపట్టనున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటును నమోదు చేయించాలని, బీఎల్‌వోల యాప్‌లోని ఫ్యామిలీ ట్రీ ఆధారంగా ప్రతి ఓటర్‌ను మ్యాపింగ్‌ చేస్తున్నారన్నారు. అర్హత గల ప్రతి ఓటర్‌ పేరును జాబితా నుంచి తొలగించకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి గాలి నరేంద్ర, రాష్ట్ర లేబర్‌ బోర్డు డైరెక్టర్‌ మోస్య జోగులు, తెలుగు యువత మండల అధ్యక్షుడు డి.శ్యామ్‌, ఎంపీటీసీ మాజీ సభ్యులు కొండమ్మ, నాయకులు నూకరాజు, మహేశ్‌, నిర్మల, లక్ష్మి, సుందరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 10:03 PM