ప్రతీ ఇల్లు జల్లెడ
ABN , Publish Date - Mar 19 , 2026 | 10:56 PM
జీకేవీధి మండలం సీలేరు పంచాయతీ పరిధిలోని పార్వతీనగర్ గ్రామంలో సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో గురువారం ఆపరేషన్ వజ్ర ప్రహార్ నిర్వహించారు.
ఆపరేషన్ వజ్ర ప్రహార్‌లో భాగంగా పోలీసుల సోదాలు
సీలేరు, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం సీలేరు పంచాయతీ పరిధిలోని పార్వతీనగర్ గ్రామంలో సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో గురువారం ఆపరేషన్ వజ్ర ప్రహార్ నిర్వహించారు. ఏపీఎస్‌పీ పోలీసులతో పార్వతీనగర్‌లో కార్డన్ సెర్చ్ నిర్వహించి గ్రామంలోని ప్రతీ ఇంటిని సోదా చేశారు. ప్రతీ ఇంట్లో ఉన్న సామగ్రిని, బైకులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బైకుల రికార్డులను పరిశీలించారు. గ్రామంలో ఎక్కడైనా గంజాయి నిల్వలు, లేదా గంజాయి సాగు చేస్తున్నారా? అనే కోణంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థులతో సీఐ సమావేశమై గంజాయి సాగు, రవాణా వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో గురువారం సీఆర్‌పీఎఫ్, ఏపీఎస్పీ పోలీసులు గురువారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనాల తనిఖీలు చేపట్టారు. మండల కేంద్రం నుంచి మారుమూల గ్రామాలకు రాకపోకలు సాగించే వాహనాలను, ప్రయాణికుల లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే పోలీసులు పలు ప్రధాన రహదారుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు గస్తీ కాశారు.