Share News

సముద్ర ఇసుకనూ వదలట్లే..!

ABN , Publish Date - May 15 , 2026 | 01:02 AM

మండలంలోని మత్స్యకార గ్రామమైన కొత్తపట్నంలో తీరం వెంబడి ఇసుక దోపిడీ దర్జాగా సాగుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. రాత్రి వేళ సముద్ర ఇసుకను ఎక్స్‌కవేటర్లతో తవ్వి తరలించేస్తున్నారు.

సముద్ర ఇసుకనూ వదలట్లే..!
కొత్తపట్నం తీరం వద్ద ఇసుక తవ్వకాలు జరిపిన ప్రదేశం

రాత్రి వేళ తవ్వి తరలించేస్తున్న అక్రమార్కులు

సాధారణ ఇసుకలో కలిపేసి కొందరు, నేరుగా సముద్ర ఇసుకనే మరికొందరు విక్రయిస్తున్న వైనం

పట్టించుకోని అధికారులు

రాంబిల్లి, మే 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మత్స్యకార గ్రామమైన కొత్తపట్నంలో తీరం వెంబడి ఇసుక దోపిడీ దర్జాగా సాగుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. రాత్రి వేళ సముద్ర ఇసుకను ఎక్స్‌కవేటర్లతో తవ్వి తరలించేస్తున్నారు.

రాంబిల్లి పరిసర ప్రాంతాల్లో నిర్మాణాలు జరుగుతుండడంతో ఇసుకకు డిమాండ్‌ ఏర్పడింది. దీంతో అక్రమార్కుల కన్ను సముద్ర ఇసుకపై పడింది. ఈ ఇసుకను తవ్వి తరలించి సాధారణ ఇసుకలో కలిపేసి కొందరు విక్రయిస్తుండగా, మరికొందరు నేరుగా సముద్ర ఇసుకనే అమ్మేస్తున్నారు. దూరాన్ని బట్టి ట్రాక్టర్‌ ఇసుకను రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నట్టు తెలిసింది. అక్రమ తవ్వకాల వలన తీరంలో ఇసుక తిన్నెలు తగ్గిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సముద్ర ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - May 15 , 2026 | 01:02 AM