సీఐఐ సదస్సులో ఏటికొప్పాక హస్తకళలు
ABN , Publish Date - Nov 13 , 2026 | 12:53 AM
విశాఖలో రెండు రోజులపాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రముఖుల గ్యాలరీ వద్ద ఏర్పాటు చేసిన ఏటికొప్పాక హస్తకళాఖండాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. శ్రీవేంకటేశ్వర స్వామి కళారూపాన్ని ప్రధానంగా చేసుకుని సుమారు 80 రకాల బొమ్మలతో ఈ సెట్‌ను రూపొందించినట్టు ఏటికొప్పాక గ్రామానికి చెందిన హస్తకళాకారుడు గొర్సా సంతోష్ తెలిపారు.
ప్రముఖల గ్యాలరీ వద్ద 80 రకాల బొమ్మలతో ప్రదర్శన
ఎలమంచిలి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): విశాఖలో రెండు రోజులపాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రముఖుల గ్యాలరీ వద్ద ఏర్పాటు చేసిన ఏటికొప్పాక హస్తకళాఖండాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. శ్రీవేంకటేశ్వర స్వామి కళారూపాన్ని ప్రధానంగా చేసుకుని సుమారు 80 రకాల బొమ్మలతో ఈ సెట్‌ను రూపొందించినట్టు ఏటికొప్పాక గ్రామానికి చెందిన హస్తకళాకారుడు గొర్సా సంతోష్ తెలిపారు. సీఐఐ సదస్సుకు హాజరైన ప్రముఖులతోపాటు కలెక్టర్ విజయకృష్ణన్, జేసీ శౌర్యమాన్‌పటేల్, ఇతర అధికారులు ఏటికొప్పాక హస్తకళాఖండాలను తిలకించినట్టు చెప్పారు. కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామానికి చెందిన మరో హస్తకళాకారుడు శ్రీను, ఇంకా 40 మంది కళాకారులు కలిసి వారం రోజులపాటు శ్రమించి వీటిని రూపొందించామన్నారు. వీటిని తిలకించిన ప్రముఖులకు అర్థం అయ్యేలే ఏటికొప్పాక హస్తకళల తయారీ విధానం, విశిష్టతను తెలుగు, ఇంగ్లిషు భాషల్లో వివరిస్తూ బోర్డును ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.