డిప్యూటీ సీఎంను ఆకర్షించిన ఏటికొప్పాక కళాఖండాలు
ABN , Publish Date - Aug 16 , 2026 | 12:51 AM
ఏటికొప్పాక హస్తకళాకారులు అంకుడు కర్రతో తయారు చేసిన వారాహిమాత అమ్మవారి కళాఖండం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, అన్నా కొణిదెల దంపతులను విశేషంగా ఆకట్టుకుంది.
- ఆసక్తిగా తిలకించిన పవన్‌కల్యాణ్ దంపతులు
ఎలమంచిలి, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ఏటికొప్పాక హస్తకళాకారులు అంకుడు కర్రతో తయారు చేసిన వారాహిమాత అమ్మవారి కళాఖండం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, అన్నా కొణిదెల దంపతులను విశేషంగా ఆకట్టుకుంది. శనివారం కాకినాడలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పవన్‌కల్యాణ్ దంపతులు అనంతరం రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరంలో ఏర్పాటు చేసిన హస్తకళాకారుల స్టాల్స్‌ను పరిశీలించారు. అక్కడ ఏటికొప్పాకకు చెందిన హస్తకళాకారులు గొర్సా సంతోశ్, సింహాద్రి శంకర్‌ల స్టాల్ వద్ద సుమారు 20 నిమిషాల పాటు ఉండి కళాఖండాలను తిలకించారు. వారాహిమాత కళారూపాన్ని వారు ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఏటికొప్పాక కళారూపాలు డిప్యూటీ సీఎం దంపతులను ఆకట్టుకోవడం తమకెంతో ఆనందంగా ఉందని కళాకారులు సంతోశ్, శంకర్ తెలిపారు.