Share News

ఉత్సాహంగా ఏరువాక పౌర్ణమి

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:34 AM

మండలంలోని గడికించు మండలో సోమవారం ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని కలెక్టర్‌ టి.నిషాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.

ఉత్సాహంగా ఏరువాక పౌర్ణమి
గడికించు మండలో ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ టి,నిషాంతి

హుకుంపేట, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గడికించు మండలో సోమవారం ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని కలెక్టర్‌ టి.నిషాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులతో కలిసి భూమి పూజ చేసి దుక్కి పనులు ప్రారంభించారు. అనంతరం రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులు సేంద్రీయ పద్ధతిలో సాగు చేసి అధిక దిగుబడి సాధించాలన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందజేస్తున్నదని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌ నందు, జిల్లా ఉద్యాన అధికారి కేబీ కర్ణ, జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ (ఏపీసీఎన్‌ఎఫ్‌)భాస్కరరావు, పశుసంవర్ధక శాఖాధికారి కరుణాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 12:34 AM