కుల ధ్రువీకరణ పత్రాల్లో తప్పులు
ABN , Publish Date - Oct 21 , 2026 | 11:33 PM
మండలంలో ఎంపీటీసీ స్థానాలకు బుధవారం ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ కుల ధ్రువీకరణ పత్రాల్లో తప్పుల కారణంగా ఆలస్యమైంది.
లోపాలతో అభ్యర్థుల్లో గందరగోళం
నామినేషన్లకు ఆలస్యం
పెదబయలు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఎంపీటీసీ స్థానాలకు బుధవారం ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ కుల ధ్రువీకరణ పత్రాల్లో తప్పుల కారణంగా ఆలస్యమైంది. ధ్రువీకరణ పత్రాల్లో లోపాలు ఉండడంతో తొలుత ఎన్నికల సిబ్బంది నామినేషన్ పత్రాలను స్వీకరించకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎదురైన ఈ సమస్యతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంతో సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దార్ అంగీకారంతో కుల ధ్రువీకరణ పత్రాల్లోని లోపాలను పరిశీలించారు. అనంతరం నామినేషన్ల పత్రాలను స్వీకరించారు. సాంకేతిక కారణాల వల్లే కుల ఽధ్రువీకరణ పత్రాల్లో తప్పులు దొర్లినట్టు సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.