Share News

వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో ఇ-పర్మిట్‌ విధానం

ABN , Publish Date - May 18 , 2026 | 11:59 PM

వ్యవసాయ మార్కెట్‌ కమిటీలలో త్వరలో మాన్యువల్‌ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికి ఇ-పర్మిట్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ మేరకు రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ నుంచి ఆదేశాలు వచ్చాయి.

వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో ఇ-పర్మిట్‌ విధానం
నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయం

జిల్లాలోని ఆరు ఏఎంసీల పరిధిలో 290 మంది లైసెన్స్‌ ట్రేడర్లు

మాన్యువల్‌ విధానానికి త్వరలో స్వస్తి పలకనున్న ప్రభుత్వం

నర్సీపట్నం, మే 18 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ మార్కెట్‌ కమిటీలలో త్వరలో మాన్యువల్‌ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికి ఇ-పర్మిట్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ మేరకు రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ నుంచి ఆదేశాలు వచ్చాయి. జిల్లాలో ఆరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రభుత్వం నుంచి లైసెన్స్‌ పొందిన వ్యాపారులు (టేడర్లు) 290 మంది ఉన్నారు. అనకాపల్లి ఏఎంసీలో 120, నర్సీపట్నం 79, చోడవరం 20, మాడుగుల 13, పాయకరావుపేట 28 మంది, ఎలమంచిలి 30.. మొత్తం 290 మంది వ్యాపారులు ఉన్నారు. ఇప్పటి వరకు మాన్యువల్‌ విధానంలో లావాదేవీలు నిర్వహించేవారు. ప్రభుత్వం ఇ- పర్మిట్‌ విధానాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ట్రేడర్లు అందరూ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. వ్యాపారులకు ఇచ్చిన లాగిన్‌లో నెలవారీ కొనుగోలు వివరాలు నమోదు చేస్తారు. మార్కెట్‌ కమిటీకి చెల్లించాల్సిన సెస్సు అమౌంట్‌ కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లిస్తారు. ప్రస్తుతం ట్రేడర్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతున్నది. సాంకేతిక సమస్యల కారణంగా ప్రక్రియ కాస్త ఆలస్యంగా జరుగుతోంది.

Updated Date - May 18 , 2026 | 11:59 PM