పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
ABN , Publish Date - Jun 05 , 2026 | 10:17 PM
పర్యావరణ పరిక్షణ మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక గురుకుల కళాశాలలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ పచ్చదనం పెంపునకు కృషి చేయాలన్నారు.
పర్యావరణ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ నిషాంతి
ప్రతి ఒక్కరూ అమ్మ పేరిట మొక్కలు నాటాలని పిలుపు
పచ్చదనం పెంపునకు కృషి చేయాలి
పాడేరు, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిక్షణ మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక గురుకుల కళాశాలలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ పచ్చదనం పెంపునకు కృషి చేయాలన్నారు. పర్యావరణమే మన భవిష్యత్తు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు తమ అమ్మ పేరిట మొక్కను నాటాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈసందర్భంగా గురుకులం కళాశాల ఆవరణలో, అనంతరం స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరు గంగులయ్య, జీసీసీ డైరెకర్ బొర్రా నాగరాజు, డ్వామా పీడీ విద్యాసాగరరావు, డీఎఫ్‌వో ఉమామహేశ్వరి, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పీబీకే.పరిమిళ, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, డీపీవో కేపీ.చంద్రశేఖర్, డీఎల్‌పీవో పీఎస్.కుమార్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, గురుకులం సెల్ ఓఎస్‌డీ మూర్తి, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.