పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
ABN , Publish Date - Jul 18 , 2026 | 11:12 PM
పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని ఇన్‌చార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ పిలుపునిచ్చారు.
ఇన్‌చార్జి కలెక్టర్ టి.శ్రీపూజ
కలెక్టరేట్ ఆవరణలో ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’
పాడేరు, జూలై 18 (ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని ఇన్‌చార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ పిలుపునిచ్చారు. మూడో శనివారం పురస్కరించుకుని కలెక్టరేట్ పరిసరాల్లో స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ ఆవరణలో పరిశుభ్రతా చర్యలు చేపట్టి, మొక్కలను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో ఆమె స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చే యించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజాన్ని స్థాపించేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యతనీయాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను భూమిలో కలపకుండా, నిర్థేశిత ప్రదేశాల్లో మాత్రమే పారబోయాలన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఇన్‌చార్జి కలెక్టర్ శ్రీపూజ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్.లోకేశ్వరరావు, ఆర్‌డీవో ఎం.భుజంగరావు, కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.