ఉత్సాహంగా కుటుంబ సర్వే గ్రామసభలు
ABN , Publish Date - Jun 19 , 2026 | 10:42 PM
అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధికి కార్యక్రమాలు మరింత పగడ్బందీగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏకీకృత కుటుంబ సర్వేపై శుక్రవారం జిల్లాలోని ప్రతి పంచాయతీలో గ్రామసభలను నిర్వహించారు.
జిల్లాలోని 244 గ్రామ పంచాయతీల్లోనూ నిర్వహణ
జిల్లా వ్యాప్తంగా 1,96,199 కుటుంబాలు,
6,56,805 మంది జనాభా గుర్తింపు
పాడేరు, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధికి కార్యక్రమాలు మరింత పగడ్బందీగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏకీకృత కుటుంబ సర్వేపై శుక్రవారం జిల్లాలోని ప్రతి పంచాయతీలో గ్రామసభలను నిర్వహించారు. ఆయా గ్రామసభల్లో నమోదైన కుటుంబాలకు సంబంధించిన సమాచారంపై ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. జిల్లాలో 11 మండలాల్లో 1 లక్షా 96 వేల 199 కుటుంబాలకు నిర్వహించిన సర్వేలో 6 లక్షల 56 వేల 805 మంది జనాభా ఉన్నట్టు గుర్తించారు. వాటిని శుక్రవారం నిర్వహించిన గ్రామసభల్లో ప్రజలు ఆమోదం తెలిపారు. అయినప్పటికీ వాటిపై ఎవరికైనా ఎటువంటి అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు చేయాల్సి ఉన్నా ఈనెల 24 తేదీలోపు ఫిర్యాదులు/వినతులు సంబంధిత సచివాలయంలో అందించవచ్చు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.