Share News

మహిళల భద్రతకు అభయ

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:53 PM

మహిళల భద్రతకు పోలీసు శాఖ మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. మహిళలకు పూర్తి రక్షణ వలయాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో ‘మీ భద్రత- మా బాధ్యత’ అనే నినాదంతో పోలీసు శాఖ రూపొందించిన ‘అభయ’ కార్యక్రమాన్ని బుధవారం ఉదయం వేంపాడు టోల్‌ప్లాజా సమీపాన వున్న ఒక ప్రైవేటు కన్వెన్షన్‌ సెంటర్‌లో హోం మంత్రి అనిత, ఐజీ గోపీనాథ్‌ జట్టి, ఎస్పీ తుహిన్‌ సిన్హా ప్రారంభించనున్నారు.

మహిళల భద్రతకు అభయ
అభయ పేరుతో జిల్లా పోలీసు యంత్రాంగం రూపొందించిన ప్రచార కరపత్రం

నేడు లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రి అనిత

నక్కపల్లి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): మహిళల భద్రతకు పోలీసు శాఖ మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. మహిళలకు పూర్తి రక్షణ వలయాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో ‘మీ భద్రత- మా బాధ్యత’ అనే నినాదంతో పోలీసు శాఖ రూపొందించిన ‘అభయ’ కార్యక్రమాన్ని బుధవారం ఉదయం వేంపాడు టోల్‌ప్లాజా సమీపాన వున్న ఒక ప్రైవేటు కన్వెన్షన్‌ సెంటర్‌లో హోం మంత్రి అనిత, ఐజీ గోపీనాథ్‌ జట్టి, ఎస్పీ తుహిన్‌ సిన్హా ప్రారంభించనున్నారు. మహిళల భద్రత కోసం జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేసేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ డెస్క్‌ను కూడా ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలో 112 నంబర్‌కు, మహిళల హెల్ప్‌ లైన్‌ 181 నంబర్‌కు, చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ 1098 నంబర్‌కు, సైబర్‌ క్రైం హెల్ప్‌ లైన్‌ 1930 నంబర్‌కు, వాట్సాప్‌ హెల్ప్‌ లైన్‌ 79934 85111 నంబర్‌కు కాల్‌ చేయడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

Updated Date - Jul 14 , 2026 | 11:53 PM