Share News

ముగిసిన ఈఎంఆర్‌ఎస్‌ స్పోర్ట్స్‌ మీట్‌

ABN , Publish Date - Sep 19 , 2026 | 11:23 PM

అరకులోయ ఈఎంఆర్‌ఎస్‌ పాఠశాలలో గత మూడురోజులుగా నిర్వహించిన స్పోర్ట్స్‌మీట్‌ శనివారంతో ముగిసింది.

ముగిసిన ఈఎంఆర్‌ఎస్‌ స్పోర్ట్స్‌ మీట్‌
వాలీబాల్‌లో రన్నర్‌గా నిలిచిన జీకేవీధి బాలికలతో అధికారులు.

విజేతలకు బహుమతులు ప్రదానం

అరకులోయ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):

అరకులోయ ఈఎంఆర్‌ఎస్‌ పాఠశాలలో గత మూడురోజులుగా నిర్వహించిన స్పోర్ట్స్‌మీట్‌ శనివారంతో ముగిసింది. ఈ పోటీల్లో రాష్ట్రంలోని సెకెండ్‌ క్లస్టర్‌కు చెందిన 9 ఈఎంఆర్‌ఎస్‌ పాఠశాలల నుంచి 350 మంది బాలబాలికలు పాల్గొన్నారు. బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌, హ్యాండ్‌బాల్‌, ఖోఖో, కబడ్డీ, చెస్‌, అథ్లెటిక్స్‌ పోటీలలో బాలబాలికలు చక్కటి ప్రతిభను కనబరిచి విజేతలుగా నిలిచారు. తొలి రెండు రోజులు అరకులోయ క్రీడాపాఠశాల మైదానంలో ఆటల పోటీలు నిర్వహించగా.. ముగింపు కార్యక్రమాన్ని మజ్జివలస సమీపంలోని అరకులోయ ఈఎంఆర్‌ఎస్‌ పాఠశాలలో నిర్వహించారు. విజేతలకు ముఖ్యఅతిథి స్టేట్‌ అకడమిక్‌ మోనటరింగ్‌ ఆఫీసర్‌ జి.జాన్సన్‌ దేవరాజ్‌, స్థానికక్రీడా పాఠశాల ప్రిన్సిపాల్‌ పీఎస్‌ఎన్‌.మూర్తి, అరకులోయ మండల ఏటీడబ్ల్యూవో వెంకటరమణ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అరకులోయ ఈఎంఆర్‌ఎస్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌ భాస్కరరావు, పీడీలు, పీఈటీలు, బాలబాలికలు పాల్గొన్నారు.

విజేతలు వీరే...

అథ్లెటిక్స్‌లో లాంగ్‌జంప్‌లో జీకేవీధి పాఠశాల విద్యార్థికి బంగారు పతకం.. అరకులోయ విద్యార్థికి సిల్వర్‌ పతకం సాధించారు. వాలీబాల్‌లో జీకేవీధి బాలికలు ప్రథమ స్థానంలో నిలవగా.. ద్వితీయ స్థానంలో హుకుంపేట విద్యార్థులు నిలిచారు.

Updated Date - Sep 19 , 2026 | 11:23 PM