ముఖ హాజరుకు ఉపాధి శ్రామికుల పాట్లు
ABN , Publish Date - May 12 , 2026 | 12:40 AM
ఉపాధి హామీ పనులకు ముఖ హాజరు తప్పనిసరి చేయడంతో శ్రామికులకు ఇబ్బందులు తప్పడం లేదు. రోజుకు రెండు సార్లు సెల్ సిగ్నల్ అందే ప్రాంతానికి వెళ్లవలసి వస్తోందని వారు వాపోతున్నారు.
సెల్ సిగ్నల్ కోసం కొండెక్కాల్సిన దుస్థితి
పెదబయలు, మే 11 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పనులకు ముఖ హాజరు తప్పనిసరి చేయడంతో శ్రామికులకు ఇబ్బందులు తప్పడం లేదు. రోజుకు రెండు సార్లు సెల్ సిగ్నల్ అందే ప్రాంతానికి వెళ్లవలసి వస్తోందని వారు వాపోతున్నారు. ఈ సమస్యపై మండలంలోని గోమంగి పంచాయతీలో గల ఉపాధి శ్రామికులు సోమవారం నిరసన చేపట్టారు. తమ హాజరును వేసుకోవాలంటే రోజుకు రెండుసార్లు సెల్ సిగ్నల్ గల ప్రాంతానికి వెళ్లవలసి వస్తోందని, సెల్ సిగ్నల్ కోసం కొండలు, గుట్టలు ఎక్కి గంటల తరబడి నిరీక్షించినా ముఖ హాజరు పడడం లేదని పంచాయతీ పరిధిలోని బోయరాజులు, రాయిమామిడి గ్రామాల్లోని ఉపాఽధి శ్రామికులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనుల్లో తీసుకొచ్చిన ముఖ హాజరు విధానం వలన ఇబ్బందులు ఎదురవుతుండడంతో గిరిజన యువత పొరుగు రాష్ట్రాలకు కూలి పనులకు వెళ్లిపోతున్నారని చెప్పారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.